హీరో నిఖిల్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్ధ్ గారు కాసేపటి క్రితమే కన్నుమూశారు. కొన్నేళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2020కి ముందు నుంచి నిఖిల్ తండ్రి ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. తీవ్రమైన డయాబెటిస్ తో ఆయన బాధపడేవారు. సికింద్రాబాద్ లో ఉన్న కిమ్స్ హాస్పిటల్ లో ఆయన చాలా కాలం నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 

 


రీసెంట్ గా ఆయన పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. తండ్రితో నిఖిల్ కి మంచి బాండింగ్ ఉంది. ఇప్పుడు అతడు మరణించడంతో నిఖిల్ తట్టుకోలేకపోతున్నాడట. నిఖిల్ ను సినీ పరిశ్రమలో ఉన్న కొంతమంది స్నేహితులు పరామర్శించడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అభిమానులు నిఖిల్‌ను పరామర్శిస్తూ.. సోషల్‌ మీడియా వేదికగా ఆయన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

 


నిఖిల్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అతడు 'కార్తికేయ 2', '18 పేజెస్' సినిమాల్లో నటిస్తున్నాడు. అలాగే 'స్పై' టైటిట్‌తో ఇటీవల ఓ పాన్ ఇండియా సినిమాను కూడా ప్రకటించాడు ఈ యంగ్ హీరో. వరుస ప్రాజెక్ట్స్‌తో ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా సక్సెస్‌ సాధిస్తూ ముందుకు వెళుతున్న నిఖిల్‌కు పితృవియోగం కలగడం బాధాకరం.