YSRCP and BRS politics are going in different directions :  తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. ఇప్పటి వరకూ కలసి నడుస్తున్నారని భావించిన  వైఎస్ఆర్‌సీపీ, బీఆర్ఎస్ రాజకీయం చెరో దారిలో వెళ్లడం ప్రారంభించాయి. కారణం ఏదైనా తెలంగాణ ఉద్యమ సమయంలో వైసీపీ .. బీఆర్‌ఎస్‌కు రాజకీయ శత్రవు కంటే ఎక్కువ. మహబూబాబాద్‌లో జగన్‌ పర్యటనను అడ్డుకుని రాళ్ల దాడి చేసి మరీ వెనక్కి పంపేశారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత అంతా మారిపోయింది. బీఆర్ఎస్, వైసీపీ ఫ్రెండ్స్ అయ్యాయి. ఇరువురూ ఉమ్మడి శత్రువుగా టీడీపీని తీసుకుని.. తమదైన వ్యూహాలను అమలు చేస్తూ రాజకీయం చేస్తున్నారు. 


ఇద్దరికీ కలిపి వచ్చే సీట్లతో ఢిల్లీ రాజకీయంలో చక్రం తిప్పవచ్చని ప్లాన్


బీఆర్ఎస్, వైసీపీకి వచ్చే సీట్లతో ఢిల్లీలో చక్రం తిప్పవచ్చని రెండు పార్టీల నేతలు అనుకున్నారు. గతంలో ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం పోరాడతానని కేసీఆర్ కూడా చెప్పారు. అయితే ఢిల్లీ రాజకీయ పరిణామాలు వీరి పార్టీలకు ఎప్పుడూ అనుకూలంగా మారలేదు. దీంతో అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. కానీ రాజకీయాల్లో ఎప్పుడూ సక్సెస్‌లే కాదు.. ఎదురు దెబ్బలూ ఉంటాయి కాబట్టి ఇప్పుడా పరిస్థితిలోకి ఒకే సారి రెండు పార్టీలు వచ్చాయి. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుపు కోసం వైసీపీ నేతలు గట్టిగానే ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఏపీలో వైసీపీ గెలుస్తుందని తమకు సమాచారం ఉందని పదే పదే ప్రచారం చేసినా ..వైసీపీకి కాలం కలసి రాలేదు. దీంతో జాతీయ  రాజకీయల్లో తమ పాత్రేమీ లేకుండా అయిపోయింది. 


వన్ డే వండరేనా ? కేసీఆర్ రోజూ అసెంబ్లీకి వస్తారా ?


ఇప్పుడు బీజేపీ వైపు బీఆర్ఎస్ 


బీఆర్ఎస్, వైసీపీలకు ఇప్పుడు తమకో అండ ఉండాలని జాతీయ స్థాయిలో ఎవరి రాజకీయాలు వారు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ అని వార్యంగా బీజేపీకి  బీఆర్ఎస్ దగ్గరవుతోంది. అంతే అనివార్యంగా కాంగ్రెస్ కు  జగన్ దగ్గరవుతున్నారు. బీజేపీ నుంచి తన పార్టీకి పొంచి ఉన్న పెను ముప్పు నుంచి  తప్పించుకునేందుకు,  కవితను జైలు నుంచి బయటకు తెచ్చేందుకు  బీఆర్ఎస్ కు మరో మార్గం కనిపించడం లేదని  రాజకీయవర్గాలు చెబుతున్నాయి.  అందుకే బీజేపీతో విలీన ఫార్ములాపై చర్చించి వచ్చారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.  ఇంప్లిమెంట్ చేయడమే మిగిలింది. అందులో భాగంగానే బీజేపీపై విమర్శలు చేయడం లేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నా.. బీఆర్ఎస్ నేతలు నోరు మెదపడం లేదు.  కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఏమీ రాలేదని రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు కానీ బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. అసెంబ్లీలోనూ అదే వరుస. రాష్ట్ర బడ్జెట్‌ను చీల్చి చెండాడుతానని అటున్న కేసీఆర్ .. కేంద్ర బడ్జెట్‌పై ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నిస్తూంటే.. స్పందించడం లేదు. 


కాంగ్రెస్ కూటమి వైపు వైఎస్ఆర్‌సీపీ 


వైసీపీ ఇప్పుడు కాంగ్రెస్ కూటమి వైపు వెళ్తోంది.  షర్మిల రూపంలో ఏపీ కాంగ్రెస్ వైసీపీకి ముప్పుగా మారుతుందన్న  స్పష్టత  రావడంతో  కాంగ్రెస్ కూటమి వైపు వెళ్లిపోతున్నారు. ఇండీ కూటమి వైపు వెళ్లానని చెప్పడానికే ఆయన ఢిల్లీ ధర్నాను ఉపయోగించుకున్నారని ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు బీజేపీకి ఏ బిల్లుకూ మద్దతు తెలుపలేరు. అలా చెబితే రాజకీయాల్లో ఇతర పార్టీల నేతలు ఆయనను నమ్మరు. అన్నీ ఆలోచించే ఆయన ఇండీ కూటమి నేతల మద్దతు తీసుకున్నారు. ల బీజేపీకి ఆయన మరోసారి దగ్గరయ్యే అవకాశాలు లేవు. అంటే బీఆర్ఎస్ బీజేపీ వైపు  జగన్ కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు.


చిల్లరమల్లర ప్లాట్ ఫాం స్పీచ్ - బడ్జెట్‌పై తేల్చేసిన కేసీఆర్


భవిష్యత్‌లో చక్రం తిప్పే చాన్స్ వస్తే మళ్లీ కలుస్తారు  !


ఇద్దరికీ వచ్చే పార్లమెంట్ సీట్లతో జాతీయ రాజకీయాలను దున్నేయాలన్నది కేసీఆర్, జగన్ ప్లాన్ . కానీ చివరికి రెండు పార్టీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు  వారికి అనువైన మార్గాల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. భ విష్యత్ లో కాలం కలసి వస్తే.. మళ్లీ కలిసేంత స్నేహం మాత్రం కొనసాగించనున్నారు.   కాలం కలసి వచ్చినప్పుడు  వారి అనివార్యతల్ని పక్కన పెట్టి  రాజకీయాలు చేసేందుకు మాత్రం ఓ దారి ఉంచుకునే అవకాశం ఉందనేది ఎక్కువ మంది నమ్మే అంశం.