KCR On Bhatti Budget :  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై కేసీఆర్ పెదవి విరిచారు.  ఈ బడ్జెట్ ఎవరికి కూడా భరోసా కల్పించేలా లేదన్నారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.  డబ్బొచ్చినప్పుడల్లా ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదన్నారు.  ఏ కొత్త సంక్షేమ పథకాలు బడ్జెట్‌లో లేవని స్పష్టం చేశారు.  మహిళా సంక్షేమం పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సి ఉన్నా.. ఏమీ చెప్పలేదన్నారు. మహిళలకు  రుణాలే ఇస్తామన్నారు. అది అల్రెడీ ఉన్న స్కీమేనని గుర్తు చేసారు.  కొత్త ప్రభుత్వం తర్వాత ఆరు మాసాల సమయం ఇవ్వాలని అనుకున్నామని..  ఈ‘అర్భక ప్రభుత్వం’ బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ చేసినట్లుగా కనిపించలేదన్నారు. 


కీలక పథకాల ఊసు లేదు !


 రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేం రెండు పంటలకు కూడా రైతు బంధు ఇచ్చామని.. వ్యవసాయంపై మాకు స్పష్టమైన అవగాహన ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు..  కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు’ను ఎగ్గొడదామని చూస్తున్నారు. రైతుబంధుపై దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ‘రైతు శత్రు ప్రభుత్వం’ అని తెలుస్తోందని..  ధాన్యం కొనుగోలు, విద్యుత్, నీరులు సరఫరా చేయడం లేదు. చాలా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. బడ్జెట్‌లో  రైతుబంధు, రైతు భరోసా’ల ప్రస్తావనే లేదు. ఎప్పుడేస్తరని మా ఎమ్మెల్యేలు అడిగితే దానికి సమాధానం చెప్పట్లేదని మండిపడ్డారు.  


రాజకీయ సభల్లో మాట్లాడినట్లుగా ప్రసంగం            


 రైతులనే కాదు, వృత్తి కార్మికులనూ వంచించిందీ ప్రభుత్వమని..  ఇండస్ట్రియల్ పాలసీ వట్టిదే గ్యాసు.. ట్రాష్. ఈస్ట్ మన్ కలర్ లో స్టోరీ టెల్లింగ్ ల తప్ప బడ్జెట్ లో ఏం లేదని గుర్తు చేశారు.  రాష్ట్రంలో వ్యవసాయం, పారిశ్రామిక, ఐటీ, పేద వర్గాలకు సంబంధించిన వాటిపై పాలసీలు ఏంటి? అనే ఏ ఒక్కదానిపైనా ఏమీ లేదన్నారు.  చిల్లరమల్లర ప్లాట్ ఫాం స్పీచ్’ గా, రాజకీయ సభల్లో ప్రసంగంలా తప్ప బడ్జెట్ ప్రసంగంలా లేదని  బడ్జెట్ లో ఒక పాలసీ గానీ, ఏదైనా సాధిస్తామన్న పద్ధతి గానీ, పద్దు గానీ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.  


ఈ బడ్జెట్‌ను చీల్చి చెండాడుతాం !               


గొర్రెల పంపకం ప‌థ‌కాన్ని మూసివేసిన‌ట్టు అర్థ‌మ‌వుతుంది. అట్ట‌డుగు వ‌ర్గాల గొంతు కోసింది. ద‌ళిత బంధు ప్ర‌స్తావ‌న లేనే లేదు. ఇది చాలా దుర్మార్గం.  ఇది పేదల బడ్జెట్ కాదు.. రైతుల బడ్జెట్ కాదు. దీనిపై భవిష్యత్తులో మేం చీల్చి చెండాడతామని హెచ్చరించారు. ఏ ఒక్క పాల‌సీని కూడా నిర్దిష్టంగా ఈ ప‌నిని మేం ఇలా సాధిస్తాం.. మా గోల్స్, టార్గెట్స్ ఇవి అనే ప‌ద్ధ‌తి కానీ, ప‌ద్దు కానీ లేదు. ఇది పేద‌ల బ‌డ్జెట్ కాదు.. రైతుల బ‌డ్జెట్ కాదు.. ఎవ‌రి బ‌డ్జెటో రేపు మీకు విశ్లేష‌ణ‌లో తెలుస్తుందన్నారు.