తెలంగాణ ముఖ్యమంత్రి ఇన్నిరోజులు దోచుకున్న సొమ్ముని దాచుకోవడానికే సమయం సరిపోట్లేదు..ఇంకా ప్రజల గురించి పట్టించుకునేంత తీరిక ఆయనకు ఎక్కడ ఉంది అంటూ వైఎస్సాఆర్ టీపీ అధ్యక్షురాల వైఎస్ షర్మిల విమర్శించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే వారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంటే..మన దొరకి మాత్రం ఎన్నికల ముందు మాత్రమే హామీలు గుర్తుకు వస్తాయంటూ ధ్వజమెత్తారు.


ఇన్ని రోజుల్లో గడీల్లో కుంభకర్ణుడిలాగా మొద్దు నిద్ర పోయిన సీఎం..ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎక్కడో అటక మీద దాచిన మేనిఫెస్టో కిందకి దింపి దుమ్ము దూలుపుతున్నారని కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో రైతులకు అది చేస్తాం..ఇది చేస్తామని హామీలు ఇచ్చారు. కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు. దాంతో మళ్లీ రైతుల ముందుకు వెళ్లడానికి మోహం చెల్లక సిగ్గుతో ఓట్లు అడగలేక రుణమాఫీ చేస్తానని కొత్త అస్త్రంతో నక్క వినయాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. 






ఇప్పటి వరకు వచ్చిన నిధులన్నింటిని దోచేసుకున్న సీఎంకి రుణమాఫీలు చేసేందుకు చేతిలో ఒక చిల్లిగవ్వ కూడా లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ బంధిపోట్లకు ఎప్పుడూ ఎక్కడ దోచేసుకుందామా అని ఆరాటపడటమే తప్ప ఒక్కరికైనా ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశం ఉందా అంటూ ప్రశ్నించారు. 


మేనిఫెస్టోలో హామీలు నెరవేర్చడానికి సీఎం కి డబ్బులు ఎక్కడివి..అవిలేకపోవడంతోనే ఎప్పుడో నవంబర్‌ లో చేయాల్సిన మద్యం టెండర్లను మూడు నెలల ముందుగానే తీసుకువచ్చాడని ఆరోపించారు. జనాలకు ఫుల్లుగా మద్యం తాగించి ఆ వచ్చిన సొమ్ముతో రుణమాఫీ చేస్తారట అని పేర్కొన్నారు. 






'' ఓ సిగ్గులేని ముఖ్యమంత్రి గారు..? ట్యాక్స్ లు పెంచి, రేట్లు పెంచి ఇప్పటికే ప్రజల రక్తం తాగుతున్నారు..అది కూడా చాలదని రానున్న రోజుల్లో మద్యం తాగించి మహిళల తాళిబొట్లు తెంచి, జనాలను తాగుడుకు బానిస చేసి ఓట్లు దండుకోవాలనుకుంటున్నారా? . మూడు సంవత్సరాల క్రితం అంటే కరోనా సమయంలో కూడా తెలంగాణ ముందుకు దూసుకెళ్లిందని డప్పులు కొట్టి..ఇప్పుడేమో రుణమాఫీలు చేయడానికి నీకు కరోనా అడ్డొచ్చిందా అంటూ ప్రశ్నించారు.


గవర్నమెంట్ భూములను యథేచ్చగా అమ్ముకుంటున్నారని..పకడ్బందీగా ఎన్నికల కోసం డబ్బును పోగు చేసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. కేసీఆర్‌ ఏదైనా పని చేశారు అంటే అది కేవలం ఎలక్షన్స్ కోసమే చేస్తారనే మాటలను చాలా బాగా నిలబెట్టుకున్నారని ఆమె కౌంటర్ ఇచ్చారు. 


నీ పిట్టల దొర ముచ్చట్లను కనీసం నీ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తుల కూడా నమ్మరు. అలాంటిది ప్రజలు ఇంకా నమ్ముతున్నారన్న భ్రమలో బతుకుతున్నావు నువ్వు అంటూ విమర్శించారు. అయ్యా దొర ముందుగా ప్రజలకు డబుల్ బెడ్‌ రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి ఇవ్వండి, వరద ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకోండి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. 


చట్ట సభల్లో బీసీలకు 33 శాతం , మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయండి. బీసీల్లోని అన్ని కులాలకు బీసీ బంధు ఇవ్వండి. ఎన్నికలకు ముందే రెండు దఫాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి నేను పిట్టల దొర కాదు. నా మాటలకు విలువ ఉందని నిరూపించుకోండి అంటూ షర్మిల పేర్కొన్నారు.