YCP politics on Vijayawada floods  How much help : ఆంద్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ ఇంకా వ్యూహాత్మక తప్పిదాలే చేస్తోంది. ఎన్నికల్లో ఘోరమైన ఓటమి తర్వాత రెండో వారం నుంచి ప్రభుత్వం ఫెయిలైపోయిందని విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అదే చేశారు. విజయవాడ వరదల్ని మేన్ మేడ్ ఫ్లడ్స్ అని జగన్ ఆరోపించారు. వరద బాధితులకు ఎలాంటి సాయం అందడం లేదని కూడా అన్నారు. రెండు రోజులు.. గంట గంట చొప్పున ఆయన విజయవాడలో పర్యటించి ఈ ఆరోపణలు చేశారు. తర్వాత సైలెంట్ అయిపోయారు. అన్ని విమర్శలు చేసిన జగన్ .. తమ పార్టీ తరపున కనీస సహాయ చర్యలను చేపట్టకపోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. 


ఫీల్డ్ లో కనిపిచంని వైసీపీ నేతలు


విజయవాడకు వరదలు వచ్చినప్పటి నుుంచి ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది. అయితే ప్రభుత్వానికి ఉండే వనరులు పరిమితం. అందరికీ ఒకే సారి సర్వీస్ చేయలేరు. అందుకే స్వచ్చంద సంస్థలతో సలహా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు రంగంలోకి దిగి ప్రజల్ని ఆదుకునేందుకు ప్రయత్నించారు. అయితే వైసీపీ నేతలు ఎక్కడా కనిపించలేదు.  జనసేన నుంచి వైసీపీలో చేరిన పోతిన మహేష్ కొన్ని చోట్ల పులిహోర పొట్లాలు పంచుతూ హడావుడి చేశారు కానీ..అవి సుజనా చౌదరి ఫౌండేషన్ నుంచి తీసుకొచ్చి  పంచారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. పెద్దగా సాయం చేసింది కూడా ఏమీ లేదు. దీంతో అసలు వైసీపీ వరద బాధితుల్ని పట్టించుకోలేదన్న విమర్శలు ఎదుర్కొంది. 


ఏపీలో వరదలపై ఒక్క రూపాయీ ఇవ్వలేదు - కేంద్రం సాయంపై చంద్రబాబు స్పష్టత


జగన్ రూ. కోటి సాయం - ఎలా ఇస్తారో ..ఎప్పుడిస్తారో ఎవరికీ తెలియదు !


పార్టీ నేతల సమావేశంలో విజయవాడ వరద బాధితుల కోసం రూ. కోటి ఇస్తున్నట్లుుగా జగన్ చెప్పారు. అయితే సీఎంఆర్ఎఫ్ కు ఇవ్వడం లేదని..  సొంతంగా సాయం చేయాలని నిర్ణయించారు. బాధితులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇప్పుడు సాయం చేస్తేనే వారికి సాయం అందినట్లుగా ఉంటుంది. అయితే ఇంత వరకూ రూ. కోటితో ఏం చేయాలో చెప్పలేదు. నిజానికి వైసీపీ సొంతంగా రూ. కోటితో ఏదైనా సాయం చేయాలనుకుని చేసినా.. విమర్శల పాలవుతుంది. ఎందుకంటే.. లక్షల మందికి .. రూ. కోటితో వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేరు. అయినా ఆ కోటితో ఏమిస్తారో చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. హుదూద్ సమయంలోనూ ఇలాగే రూ.కోటి ప్రకటించారు కానీ.. ఇంత వరకూ ఇవ్వలేదని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి వంటి వారు విమర్శిస్తున్నారు. వరదలు అంతా సద్దుమణిగిపోయాక.. ప్రజలంతా సాధారణ జీవనంలోకి వెళ్లిపోయాక.. వైసీపీ సాయం చేసినా ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే అవసరమైనప్పుడే చేయాలని గుర్తు చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఆ కోటి గురించి మళ్లీ మాట్లాడటం లేదు. 


బుడమేరు గండ్లు పూడ్చివేత - ఆర్మీ కీలక ప్రకటన, దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తోన్న మంత్రి నిమ్మల


రాజకీయం మాత్రం ఫుల్


అయితే రాజకీయం మాత్రం తగ్గడం లేదు.  చంద్రబాబు ఎండీయూ వాహనాలతో.. ఇంటింటికి సాయం పంపిణీ చేసే ఏర్పాట్లు చేశారు. ఆ వాహనాలను జగనే కొనుగోలు చేశారని అంటున్నారు. ఎవరు కొనుగోలు చేసినా అవి ప్రభుత్వ ఆస్తులని.. ఎందుకూ పనికి రాకండా.. మూడు వేల కోట్లు వృధా చేస్తే కనీసం దీనికైనా ఉపయోగపడ్డాయని టీడీపీ నేతలంటున్నారు. మరో వైపు వైసీపీ నేతలు .. తమ పార్టీకి చెందిన చానల్ ద్వారా రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. బుడమేరకు.. కృష్ణానదికి లింక్ లేకపోయినా పెట్టేసి విమర్శలు చేశారు. చంద్రబాబు ఫీల్డ్ లో తిరగడాన్ని పబ్లిసిటీ స్టంట్ అన్నారు. అసలు ప్రభుత్వం ఏమ చేయడం లేదని చెన్నై నుంచి రోజా వీడియో విడుదల చేయడం మరిన్ని విమర్శలకు కారణం అయింది. కనీస సాయం చేసి.. మానవత్వం చూపించాలని ఆ తర్వాతే..రాజకీయాలు చేయాలన్న సూచనలు వచ్చాయి. 


మొత్తంగా వైసీపీ ఇంకా ఏం జరిగినా రాజకీయం చేస్తే చాలన్నట్లుగా ఉందని.. కానీ ఆ వ్యూహాలను మార్చుకోవాలన్న అభిప్రాయం ఆ పార్టీ క్యాడర్ లో వినిపిస్తోంది.