BJP Vs TRS : తెలంగాణలో టీఆర్ఎస్ వర్సె్స బీజేపీ రాజకీయాలు టగ్ ఆఫ్ వార్‌లాగా సాగుతున్నాయి. ఎత్తులు,పై ఎత్తులతో రాజకీయం  చేస్తున్నారు. ఒకరు కేంద్రంలో అధికార పార్టీ.. మరొకరు రాష్ట్రంలో అధికార పార్టీ.  ప్రతి విషయంలోనూ పైచేయి సాధించాలని ఒకరికొకరు ప్రయత్నిస్తున్నారు. సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని మొదట కేంద్రం నిర్ణయించింది. అప్పటి వరకూ వివిధ కారణాలతో వద్దనుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం..  వెంటనే ఘనంగా మూడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించుకుంది. కేంద్రం తరపున నిర్వహించనున్న ఉత్సవాల్లో అమిత్ షా పాల్గొంటున్నారు. రాష్ట్రం తరపున నిర్వహించబోయే వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొనడం సహజమే. అయితే ఈ విమోచనా దినంలో టీఆర్ఎస్ నేతలు బీజేపీ కంటే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఎక్కువ ప్రచారం తమకే వచ్చేలా చూసుకుంటున్నారు. 


ప్రచార హోర్డింగ్‌లన్నీ బుక్ చేసుకున్న టీఆర్ఎస్ !
 
సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణలో హైవోల్టేజ్ రాజకీయాలు జరగనున్నాయి.  తెలంగాణ విమోచనా దినోత్సవాలను ఎవరికి వారు ఘనంగా ప్రచారం చేసుకోవాలనుకున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ నేతలు ఓ అడుగు ముందు ఉన్నారు. బీజేపీ నేతుల హైదరాబాద్‌ మొత్తం హోర్డింగ్‌లు పెట్టాలనుకున్నారు. కానీ పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ నేతలు పెట్టాలనుకోవడమే కాదు.. మొత్తం హోర్డింగ్‌లను బుక్ చేసేసుకున్నారు. దీంతో బీజేపీ నేతలకు షాక్ తగిలినట్లయింది. నిజానికి ఇలాంటి పరిస్థితి ఇటీవల మోదీ పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ నేతలకు ఎదురైంది. మోడీ సభకు ఎదురుగా కూడా టీఆర్ఎస్ హోర్డింగ్‌లే కనిపించాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే కనిపంచనుంది. 


అమిత్ షా ప్రోగ్రాం రోజు తెలంగాణ వ్యాప్తంగా కార్యక్రమాలు !


విమోచనా దినోత్సవాలను    ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం’ పేరుతో ప్రభుత్వం నిర్వహించనుంది. సె  తెలంగాణ ప్రజాస్వామిక పాలనలోకి ప్రవేశించి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ నెల 16 నుంచి 18 వరకు తెలంగాణ జాతీయ సమైక్యతా విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు.  17న హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌ సెంట్రల్‌ లాన్స్‌లో జరిగే తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అదే సమయంలో జిల్లాల్లోనూ కార్యక్రమాలు జరుగుతాయి. మీడియాలోనూ అమిత్ షా కార్యక్రమం కాకుండా.. తెలంగాణ కార్యక్రమాలే హైలెట్ అయ్యేలా టీఆర్ఎస్ ప్రణాళిక సిద్ధం చేసింది. 


సెప్టెంబర్ 17 వేడుకల నిర్వహణలో ఎవరిది పైచేయి ?


రాష్ట్రంలో, కేంద్రంలో  టీఆర్ఎస్ ,  బీజేపీలు గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్నాయి. కానీ ఎప్పుడూ తెలంగాణ విమోచనను అధికారికంగా నిర్వహించాలని అనుకోలేదు. టీఆర్ఎస్ గతంలో డిమాండ్ చేసినా సైలెంట్‌గా ఉంది. బీజేపీ నిర్వహించాలని డిమాండ్ చేసింది కానీ.. కేంద్రం తరపున నిర్వహించాలనే ఆలోచన చేయలేదు. కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయింది.  రెండు పార్టీలు పోటాపోటీగా ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. క్రెడిట్ మాకంటే మాకని పోటీ పడుతున్నాయి. మరి ఎవరిది పైచేయి అవుతుందో ?


సికింద్రాబాద్ అగ్నిప్రమాదం కేసులో షోరూం నిర్వాహకులు సహా నలుగురు అరెస్టు