రేప‌టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుకు అసెంబ్లీని వేదికగా చేసుకోనుంది ప్రభుత్వం. మూడు రాజధానులపై బిల్లు ప్రవేశ పెడతారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నెల 15 నుంచి ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. సెప్టెంబర్ 15 న ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. ఎన్ని బిల్లులు ప్రవేశ పెడతారు అనే చర్చ బీఏసీ లో జరుగుతుంది. మంత్రులు పెద్దిరెడ్డి, జోగిరమేష్ లకి సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో బీఏసీ నిర్ణయాల అమలులో కీలకంగా వ్యవహరించేలా పెద్దిరెడ్డి, జోగి రమేష్ లకు బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. బీఏసీ వ్యవహారాల కో ఆర్డినేటర్ గా శ్రీకాంత్ రెడ్డి వ్యవహరిస్తారు. సభలో జరిగే వ్యవహారాలు. ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పే విధంగా బాధ్యతలు ఈ ఇద్దరు మంత్రులు నిర్వహిస్తారు. 
చంద్రబాబు సభకు హాజరు అవుతారా !
ప్రతిప‌క్ష నేత చంద్రబాబు గత కొన్ని రోజలుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. దీంతో మిగిలిన టీడీపీ సభ్యులు అసెంబ్లీ కి హాజరు కానున్నారు. సీఎం జగన్ మంత్రులకు క్లాస్ తీసుకోవడంతో అసెంబ్లీలో మంత్రుల వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతోంది. కొంతమంది మంత్రులకు శాఖలపై పట్టులేదని సాక్షాత్తు సీఎం జగన్ చెప్పడంతో మంత్రులు హోమ్ వర్క్ మొదలు పెట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో త‌మ సత్తా చూపేందుకు మంత్రులు రెడీ అవుతున్నారు. ఈ సారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అది మంత్రులకు జగన్ క్లాస్ తీసుకోవడం... సీఎంగా త‌న‌కు ఉన్న అధికారాలు, బాధ్యత‌లు, మంత్రుల ప‌ని తీరుపై ఉన్న రిపోర్ట్ ఆదారంగా జ‌గ‌న్ వ్యవ‌హ‌రించినట్లు తెలుస్తోంది. 
మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్..
అవసరం అయితే మంత్రి పదవుల నుంచి తొలగిస్తా అని వార్నింగ్ ఇచ్చారు జగన్. దీంతో మంత్రులు అసెంబ్లీకి ప్రిపేర్ అయి వస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు అసెంబ్లీలో కొద్దిమంది మంత్రులు మాత్రమే చూపించారు. కొంతమంది అసలు హాజరు అయ్యేవారు కూడా కాదు. కానీ సడెన్ గా జగన్ మంత్రుల ప‌ని తీరుపై దృష్టి పెట్టటంతో పాటు, ప‌దవులు హూష్టింగ్ అవుతాయ‌ని హెచ్చరించ‌టంతో మంత్రుల్లో టెన్షన్ మొదలయింది. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రతి ఎమ్మెల్యే, మంత్రి అలెర్ట్ అవుతారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. సీఎం క్లాస్ తో మంత్రులు అలెర్ట్ కాదు, ఏకంగా హోమ్ వర్క్ చేసే పరిస్థితి వచ్చింది. 
వైసీపీలో నియోజక వర్గాల వారీగా పరిశీలకులు రానున్నారా..
పార్టీ పటిష్టతపై వైసీపీ అధిష్టానం మరింత దృష్టి పెట్టిందా అంటే తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. పార్టీకి నియోజకవర్గాల అబ్జర్వర్లు ను నియమించ డానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైసీపీ అధినేత సీఎం జగన్ పార్టీ పటిష్టతపై దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా 175 నియోజకవర్గాలకు అబ్జర్వర్లని నియమించనుంది వైసీపీ. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిశీలకులను నియమించి, నియోజకవర్గాల్లో పరిస్థితి ఎమ్మెల్యే పనితీరు, సంక్షేమ పథకాల అమలు ఇలాంటి విషయాలన్నీ పరిశీలిస్తారు. ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గ పరిస్థితులపై అధిష్టానానికి పరిశీలకులు నివేదికలు అందిస్తారు. జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో అబ్జర్వర్లు నియామకం జరుగుతుంది. దీనికి సంబంధించి వైసీపీ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వైసీపీ పరిశీలకులు ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న రోజుల్లోనే ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ కానున్నారు. గడప గడపకు మన ప్రభుత్వంపై చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.