TTD official Cancels Sahasra Kalashabhishekam: శ్రీనివాసుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతి బుధవారం నిర్వహించే సహస్ర కళషాభిషేకంను విగ్రహాల అరుగుదలను దృష్టిలో ఉంచుకుని ఆగమ శాస్త్రం పండితుల సలహాలు, సూచనల మేరకు రద్దు చేసింది. ఏడాది ఓమారు మాత్రమే నిర్వహించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. మంగళవారం 13-09-2022 రోజున 75,175 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 31,979 మంది తలనీలాలు సమర్పించగా, 4.05 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 29 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనంకు 12 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు రెండు గంటల సమయం పడుతుంది.
ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారికి కైంకర్యాలు
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో భాగంగా బుధవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారము తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.
ఏడాదికి ఓసారి సహస్రకళషాభిషేకం
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వి.ఐ.పి భక్తులను స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండో గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "బుధవారం" రోజు నిర్వహించే "సహస్రకళషాభిషేకం"ను విగ్రహ అరుగుల కారణంగా పరిరక్షణకై ఆగమ శాస్త్రం పండితుల సలహాలు, సూచనల మేరకు టీటీడీ రద్దు చేసింది. కేవలం ఏడాదికి ఓ మారు సర్కారు వారి సహస్రకళషాభిషేకం టీటీడీ నిర్వహిస్తొంది. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తు అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవంను నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు. అటుతరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి, ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మంపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు అర్చకులు.
సాయంకాలం సహస్ర దీపాలంకారసేవ కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు అర్చకులు. సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు. నిత్య సేవల్లోభాగంగా సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి సహస్ర దీపాలంకారసేవను నిర్వహించి, తిరుఉత్సవం నిర్వహిస్తారు అర్చకులు. అటుతరువాత ఉత్సవమూర్తులు శ్రీవారి ఆలహం చేరుకోగానే, సృవదర్శనం భక్తులను నిలిపి వేసి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. రాత్రి కైంకర్యాల్లో భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.
Tirumala News: తిరుమలలో ప్రతి బుధవారం నిర్వహించే సహస్ర కళషాభిషేకం రద్దు, కారణం ఇదే
ABP Desam
Updated at:
14 Sep 2022 08:40 AM (IST)
Sahasra Kalashabhishekam: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 29 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనంకు 12 గంటల సమయం పడుతుంది.
సహస్ర కళషాభిషేకం రద్దు
NEXT
PREV
Published at:
14 Sep 2022 08:40 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -