గళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలాధ్యక్ష ఎన్నిక ఉద్రిక్తతలకు కారణం అవుతోంది. మంగళగిరి టీడీపీ ఇంచార్జ్‌గా నారా లోకేష్ ఉన్నారు. దీంతో దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికను వైఎస్ఆర్‌సీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో దుగ్గిరాలలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ కన్నా ఒకరు ఎక్కువగా టీడీపీ అభ్యర్థులు గెలపొందారు.అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడిపోయింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక గురువారం నాడు జరగనుంది. దుగ్గిరాలలో మెజారిటీ ఎంపీటీసీలను టీడీపీ గెలుచుకున్నా... వివిధ పద్దతుల్లో ఎంపీపీ పదవిని కైవసం చేసుకునేందుకు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీపీ పదవిని పద్మావతి అనే ఎంపీటీసీ ఆశించారు. కానీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం వేరే ఎంపీటీసీని ఎంపిక చేశారు. దీంతో రెబల్‌గా అయినా పోటీ చేసేందుకు పద్మావతి సిద్ధమయ్యారు. టీడీపీ మద్దతు ఇస్తుందని వార్తలు రావడంతో పద్మావతిని ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు తమ వెంట తీసుకెళ్లారు. ఈ విషయంపై పద్మావతి కుమారుడు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లిని ఎమ్మెల్యే మనుషులు బలవంతంగా తీసుకెళ్లారన్నారు. తల్లికి ఎంపీపీ పదవిపై ఆశ లేదని చెప్పిన యోగేందర్ నాథ్ ఆమె ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేశారు. తన తల్లికి ఏదైనా జరిగితే ఎమ్మెల్యే ఆర్కేతో పాటు దుగ్గిరాల ఎస్సైలే బాధ్యత వహించాల్సి ఉంటుందని యోగేందర్ నాథ్ హెచ్చరించారు.
ఏపీలో ఉంటున్నారా ? విద్యుత్ ఆదాకు ప్రభుత్వం చెబుతున్న కొత్త చిట్కాలు తెలుసుకున్నారా ?
దుగ్గిరాల ఎంపీటీసీలుగా టీడీపీ తరపున గెలిచిన వారిలో జబీన్ అనే ఎంపీటీసీని ఎంపీపీగా నిలబెట్టాలని నిర్ణయించారు. అయితే ఆమెకు కుల ధృవీకరణ పత్రాన్ని అధికారులు జారీ చేయలేదు. రిజర్వేషన్ ప్రకారం బీసీ అభ్యర్థికి ఎంపీపీ సీటు కేటాయించారు. దుగ్గిరాల మండలంలోని 18 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 9, వైఎస్ఆర్‌సీపీ 8, జనసేన 1 స్థానాలు గెలుపొందాయి. జనసేన ఎంపీటీసీ అభ్యర్థి ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు. టీడీపీ ఎంపీపీ సీటు గెల్చుకునే అవకాశం ఉన్నా లోకేష్‌కు దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్‌సీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో టెన్షన్ ప్రారంభమయింది.
శ్రీలంకకు అత్యవసర మందులు ఇవ్వండి - సత్యసాయి ట్రస్ట్‌ను కోరిన అర్జున రణతుతంగ !