ఆంధ్రప్రదేశ్‌ను విద్యుత్ సమస్య వెంటాడుతోంది. గత నెల మొదటి వారంలో ప్రారంభమైన పవర్ హాలీడేలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నెల మొదటికి మొత్తం సమస్య పరిష్కారమవుతుందని అనుకున్నారు కానీ..  అవలేదు సరి కదా మరింత క్లిష్టంగా మారింది. డిమాండ్ కూడా పెరుగుతోంది. దీంతో ప్రజలు కూడా పొదుపు చర్యలు పాటించాలని ప్రభుత్వం పిలుపునిస్తోంది. ఈ క్రమంలో విద్యుత్ ఆదాకు ఏం చేస్తే బాగుంటుందో సూచనలు కఇచ్చింది. ఏపీ ఇంధన పరిరక్షణ మిషన్‌ (ఎపిఎస్‌ఇసిఎం) విద్యుత్ ఆదా కోసం ప్రత్యేక జాగ్రత్తలు ప్రకటించింది. ముఖ్యంగా ఎయిర్ కండిషనర్లు ఉపయోగించేవాళ్లు జాగ్రత్తలు తీసుకుంటే విద్యుత్ వినియోగం తగ్గడమే కాదు.. కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుందని అంటున్నారు. 



ఏసీల చాలా మంది 20  డిగ్రీల సెల్సియస్‌ కన్నా  ఉష్ణోగ్రతలో సెట్ చేసుకుంటూ ఉంటారు. దీని వల్ల అధికంగా కూల్అయ్యే చాన్స్ ఉండకపోగా కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది.  ఏసీలను 24 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ఉష్ణోగ్రతను సెట్‌ చేసుకుంటే విద్యుత్‌ పొదుపుతోపాటు ఆర్థికంగా వెసులు బాటు కలుగుతుంది. ఏసీ  24 డిగ్రీల సెల్సియస్‌ వద్ద వాడటం వల్ల దేశంలో ఏటా రూ.10 వేల కోట్ల విలు వైన 20 బిలియన్‌ యూనిట్‌ల ఇంధనం ఆదా అవుతుంద న్నారు. ఏసీ ఉన్న గదిలో ఒక డిగ్రీ సెల్సి యస్‌ ఉష్ణోగ్రతను పెంచితే ఆరు శాతం విద్యుత్‌ను పొదుపు చేయవచ్చు. అదే 20 నుంచి 24 డిగ్రీల సెల్సియస్‌కు ఏసిల ఉష్ణోగ్రతను సెట్‌ చేస్తే 24 శాతం విద్యుత్‌ ఆదా అవుతుంది. 


ఏపీ ఇంధన పరిరక్షణ మిషన్‌ చేసిన మరికొన్ని సూచనలు


1. వేడిగాలి ఇంట్లోకి రాకుండా ఉండేలా కిటికీలు, కర్టెన్లను విధిగా మూసి ఉంచాలి
2. ఇంట్లోకి ఉష్ణోగ్రతలు రాకుండా నిరోధించాలి
3. ఎయిర్‌ ఫిల్టర్లను నెల నుంచి మూడు నెలల్లోగా శుభ్రపరచాలి లేదా వాటిని మార్చడం వల్ల ఎసి యూనిట్‌లో గాలి సజావుగా కదులుతుంది.
4. గది నుంచి బయటకు వచ్చే సమయంలో లైట్లు, ఫ్యాన్‌లు, ఎసిల స్విచ్‌లను ఆఫ్‌ చేయాలి. అలాగే టివి చూసిన తర్వాత రిమోట్‌ ఆఫ్‌ చేసినా, పవర్‌ స్విచ్‌ను కూడా ఆఫ్‌ చేయాలి.
మొబైల్‌ చార్జర్లను సాకెట్‌ నుంచి పూర్తిగా అన్‌ప్లగ్‌ చేయాలి, లేదా కనీసం స్విచ్‌ను ఆఫ్‌ చేయాలి.
5. సమర్థ విద్యుత్‌ పొదుపు కోసం వీలైనంత వరకు సీలింగ్‌ ఫ్యాన్‌లను ఉపయోగించాలి.



ప్రస్తుతం ఏపీలో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండటానికి ఏసీలో ప్రధాన కారణం.  రాష్ట్రం మొత్తం డిమాండ్‌లో ఐదు శాతం ఏసీలకే ఉంటోంది.  రాష్ట్రంలో నేడు విద్యుత్‌ కొరత నెలకొన్న కారణంగా ప్రజలు కూడా జాగ్రత్తలు పాటిస్తే.. ఏపీకి కరెంట్ సమస్యలు తీరిపోతాయని ప్రభుత్వం చెబుతోంది.