తెలంగాణ ప్రభుత్వం జిల్లాల్లో ప్రతీ సోమవారం ప్రజావాణి-గ్రీవెన్స్ డే  ( Prajavani ) తిరిగి ప్రారంభించాలని ఆదేశాలిచ్చింది. కలెక్టర్లు ప్రతీ సోమవారం ప్రజల సమస్యను తెలుసుకుని పరిష్కారం చేయడం కోసం ఉద్దేశించిందే గ్రీవెన్స్ డే. నిజానికి అంతకు ముందు గ్రీవెన్స్ డే ఉండేది. కానీ కరోనా కారణంగా రెండేళ్లుగా ఆగిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది  రాజ్ భవన్ ( Raj Bhavan ) దృష్టికి తీసుకెళ్తున్నారు. రాజ్  భవన్ ఎదుట గవర్నర్ ఫిర్యాదుల బాక్స్ కూడా పెట్టారు. ఈ బాక్స్‌లో అనేక మంది తమ సమస్యలు వివరిస్తూ లేఖలు వేస్తున్నా రు. వాటిని గవర్నర్ కార్యాలయం సంబంధిత శాఖలకు పంపుతోంది. 


వచ్చే ఏప్రిల్‌లో తెలంగాణలో ఎన్నికలు- టీఆర్‌ఎస్‌తో ప్రశాంత్ కిషోర్‌ చర్చలు అందుకే- బాంబు పేల్చిన రేవంత్


ఉగాది వేడుకలను రాజ్‌భవన్‌లో నిర్వహించిన సమయంలో మీడియాతో మాట్లాడిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజాదర్భార్లు నిర్వహిస్తానని ప్రకటించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం ఆలకించడం లేదని.. వారి సమస్యలను తానే వింటానని ప్రకటించారు.  ప్రజల మేలు కోసమే రాజ్‌భవన్‌ ఉందని ... ప్రజాసమస్యల పరిష్కారానికి ముందడుగు వేస్తామని  ప్రకటించారు. మే నుంచి  ప్రజాదర్బారు నడుస్తుందన్నారు. అందులో వచ్చిన ప్రజాసమస్యలు ప్రభుత్వానికి నివేదిస్తానని తెలిపారు.  


యాదాద్రి కాదు యాదగిరి గుట్ట ! పేరు మళ్లీ మారిందా ?
 
అయితే మే రాక ముందే తెలంగాణ ప్రభుత్వం  గ్రీవెన్స్ డే మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించడం ఆసక్తి రేపుతోంది. గవర్నర్‌కు కౌంటర్‌గానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో గవర్నర్‌కు... తెలంగాణ ప్రభుత్వానికి సరిపడటం లేదు.  పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌పై అసంతృప్తి వ్యక్తం చేయడానికి రాజభవన్ ఎదుట ఉంచిన ఫిర్యాదుల పెట్టే కూడా ఓ కారణం అని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో గవర్నర్ ప్రజాదర్భార్లు నిర్వహించకుండా ప్రభుత్వమే అవి నిర్వహించే నిర్ణయం తీసుకందని భావిస్తున్నారు. 


బండి సంజయ్ కు అస్వస్థత, పాదయాత్రకు బ్రేక్ ఇవ్వాలని సూచించిన వైద్యులు


ప్రభుత్వమే గ్రీవెన్స్ డేను నిర్వహించాలని నిర్ణయించడంతో మే నుంచి గవర్నర్ నిర్వహించాలనుకుంటున్న ప్రజాదర్భార్లు నిర్వహిస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వ గ్రీవెన్స్‌కు రాజ్ భవన్ ప్రజాదర్భార్‌కు సంబంధం లేదని.. గవర్నర్ తాను నిర్వహించాలనుకున్న కార్యక్రమాలను నిర్వహిస్తారని అంచనా వేస్తున్నారు. మే నుంచి అనిచెప్పారు కానీ.. గవర్నర్ ఇంకా తేదీని ప్రకటించలేదు.