Kuppam Chandrababu :   తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. అయితే ఆయన పర్యటన సాగుతున్న దారిలో వైఎస్ఆర్‌సీపీ నేతలు పెద్ద ఎత్తున జెండాలు ఏర్పాటు చేశారు. ఇలా ఓ పార్టీ కార్యక్రమాల్లో మరో పార్టీ జెండాలు ఎలా ఏర్పాటు చేస్తారని.. పోలీసులే ఉద్దేశపూర్వకంగా ఇలా పెట్టారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. వైఎస్ఆర్‌సీపీ జెండాలను తొలగించేందుకు టీడీపీ శ్రేణుల యత్నించారు.  టీడీపీ శ్రేణులను  పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుదంి.  పోలీసుల తీరుకు నిరసనగా టీడీపీ శ్రేణులు రోడ్డుపై ధర్నాకు దిగాయి. 


చంద్రబాబు వెళ్లే రూట్‌లో వైఎస్ఆర్‌సీపీ జెండాల ఏర్పాటు 


చంద్రబాబు పర్యటన కోసం పోలీసులు ఇతర ప్రాంతాల నుంచి కూడా పోలీసు బలగాల్ని పిలిపించారు. అయితే వారు వైఎస్ఆర్‌సీపీ జెండాలను కట్టి వాటిని తీసేయకుండా కాపలా కాస్తున్నారని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా చంద్రబాబుకు ఆ పార్టీ శ్రేణులు ఘనస్వాగత ఏర్పాట్లు చేశారు. రామ కుప్పం పట్టణంలోని ఆటోస్టాండ్‌ సర్కిల్‌ నుంచి బహిరంగసభ జరిగే పోలీసుస్టేషను సర్కిల్‌ వరకు  తోరణాలతో అలంకరించారు. రామకుప్పం పట్టణంలో స్వాగత ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లలో వైఎస్ఆర్‌సీపీ జెండాలు కూడా చొప్పించారు. ఉద్రిక్తల నడుమే చంద్రబాబు పర్యటన సాగింది. 


అది పిస్టల్ కాదు బిస్తర్ - టీఆర్ఎస్ బీజేపీ మధ్య కొత్త ఆన్‌లైన్ పంచాయతీ !


పోలీసుల సహకారంతోనే వైఎస్ఆర్‌సీపీ నేతలు అలజడి రేపుతున్నారని చంద్రబాబు ఆగ్రహం


హంద్రీనీవా ద్వారా వీ.కోట వరకు నీరు తెస్తే.. కుప్పం వరకు నీరివ్వలేక పోయారని వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు.  టీడీపీ హయాంలో చేసిన పనులు తప్ప ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కుప్పంలో చోటామోటా నాయకులు విర్రవీగుతున్నారని మండిపడ్డారు. ‘‘నేనొస్తే ఎక్కడికక్కడ మీ జెండాలు కడతారా?.. ఇకనైనా మీ చిల్లర చేష్టలు మానుకోండి. వైసీపీ దొంగలు జాగ్రత్త.. నేనొస్తే మీ తోకలు కట్ చేస్తా. పోలీసులు మీ పని మీరు చేసుకోండి. ఎవరిపై పడితే వారిపై తప్పుడు కేసులు పెడతారా?... ఎఫ్ఐఆర్ అంటే మీ జాగీరనుకున్నారా?’’ అని చంద్రబాబు పోలీసులపై మండిపడ్డారు. 


లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలు చేయవద్దు - హైదరాబాద్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు !


చిన్ననాటి స్నేహితుడు ఇంటికి వెళ్లిన చంద్రబాబు


మూడు రోజుల పర్యటన కోసం కుప్పం వచ్చిన చంద్రబాబుకు కర్ణాటక సరిహద్దుల్లో పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.  అభిమానుల కోరిక మేరకు కాంగండ్లపల్లి గ్రామంలో ఆయన ఆగారు.  మిత్రుడు కర్ణాటక మాజీ ఎమ్మెల్యే దొరస్వామి ఇంటికి చంద్రబాబు వెళ్లారు. దొరస్వామి కుటుంబసభ్యులను ఆయన ఆత్మీయంగా పలకరించారు.   కొళ్లుపల్లె, చెల్దిగానిపల్లె, రాజుపేట మీదుగా రామకుప్పంలలో చంద్రబాబు పర్యటన సాగుతుంది.  మరో రెండు రోజుల పాటు పర్యటన ఉండటంతో.. వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు అలజడి రేపుతాయన్న ఉద్దేశంతో టీడీపీ కార్యకర్తలు ఎక్కడిక్కకడ అప్రమత్తమవుతున్నారు.