Bistar Vs Pistol : తెలంగాణలో రాజకీయానికి ఏదీ అనర్హం కాదని నిరూపితమవుతోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఇప్పటికే చాలా వివాదాలు నడుస్తూండగా.. తాజాగా బిస్తర్ అంశంపై రెండు పార్టీలు ఆన్‌లైన్‌లో వాదోపవాదాలకు దిగుతున్నాయి. బండి సంజయ్ బిస్తర్ తీసుకుని యువత అంతా పాదయాత్రకు రావాలని పిలుపునిచ్చారు. అయితే బిస్తర్ అంటే పిస్టర్ అని టీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఆరోపణలు చేయడంతో వివాదం ప్రారంభమయింది.
అయితే బీజేపీ నేతలు టీఆర్ఎస్‌పై విరుచుకుపడుతున్నారు. బిస్తర్ అని స్పష్టంగా చెప్పినా పిస్టల్ అని ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
బిస్తర్ అనేది తెలంగాణ మాండలికంలో వాడే ఓ పదం. నిద్రించడానికి ఉపయోగపడే చాప, దుప్పటి అలాగే తినడానికి తిండి అన్నింటికీ కలిపి బిస్తర్ అటారు. ఇదే విషయాన్ని బీజేపీ సోషల్ మీడియాలో తెలిపి టీఆర్ఎస్‌కు కౌంటర్ ఇచ్చింది.
ఈ అంశంలో వీడియోను పరిశీలిస్తే.. బండి సంజయ్ ఎక్కడా పిస్టల్ అనే పదాన్నే ప్రస్తావించలేదు. కానీ టీఆర్ఎస్ నేతలు పిస్టల్‌గా చెప్పడానికి ప్రాధాన్యమివ్వడంతో వివాదం అయింది. ఈ అంశంపై వివాదం రేగిన తర్వాత కూడా టీఆర్ఎస్ నేత క్రిషాంక్ తన వాదనను సమర్థించుకునే ప్రయత్నమే చేశారు.
మొత్తానికిఈ వివాదం ఆన్‌లైన్‌లో రెండు పార్టీల మధ్య వార్ సాగుతోంది. రాజకీయంలో తాము చెప్పిందే నిజమని అన్ని పార్టీలు వాదించడానికి ప్రయత్నిస్తాయి. ఎక్కువ మందిని ఎవరు నమ్మించగలిగితే వారు చెప్పేదే నిజం అన్నట్లుగా మారిపోయింది.