విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu) సతీమణి భువనేశ్వరి(Bhuvaneswari) చేపట్టిన నిజం గెలవాలి(Nijama Gelavali) యాత్రపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కావడంతో నిజం గెలవాలి యాత్ర ఫుల్ స్టాప్ పడినట్లేనా అని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. చంద్రబాబుకు బెయిల్ రాకపోయినట్లయితే నారా భువనేశ్వరి యాత్ర కొనసాగేదని అంటున్నారు. చంద్రబాబుకు నెల రోజుల పాటు బెయిల్ రావడంతో ఆయనతోనే ఉంటున్నారు. ఉండవల్లి(Undavalli)లో చంద్రబాబుకు దిష్టి తీసిన భునవేశ్వరి, అక్కడి నుంచి చంద్రబాబుతో పాటు హైదరాబాద్ చేరుకున్నారు. 


చంద్రబాబు కోసమే యాత్రకు పుల్ స్టాప్ ?
చంద్రబాబు అనారోగ్యం పాలవడంతో ఆయన వెంటే ఉంటున్నారు. దగ్గురండి చంద్రబాబును చూసుకుంటున్నారు. ఏఐజీ ఆస్పత్రి సూచన మేరకు ఒకరోజు అడ్మిట్ అయ్యారు చంద్రబాబు. టెస్టుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి వెళ్లినపుడు కూడా చంద్రబాబుతోనే ఉంటున్నారు నారా భువనేశ్వరి. వైద్యుల సూచన మేరకు చంద్రబాబుకు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు టెస్టులు చేశారు. మంగళవారం ఎల్వీ ప్రసాద్(LV Prasad Hopsital) ఆసుపత్రి వైద్యులు బాబు కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయనున్నారు. ఆపరేషన్ తర్వాత చంద్రబాబు నాయుడు బాగోగులు చూసుకోవడానికి ఆయన దగ్గరే ఉండనున్నారు ఈ నేపథ్యంలో భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రకు  తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడినట్లేనని తెలుస్తోంది. 


గత నెలలో యాత్ర చేసిన భువనేశ్వరి
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన వారి కటుుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు.  గత నెల 25న నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి చిత్తూరు(Chittoor) జిల్లాలో యాత్ర చేపట్టారు.  అక్టోబర్‌ 17న మృతి చెందిన ఆవుల ప్రవీణ్‌రెడ్డి కుటుంబాన్ని మొదట భువనేశ్వరి ఓదార్చారు. ప్రవీణ్ రెడ్డి తల్లి  అనురాధకు ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆవుల ప్రవీణ్ రెడ్డి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఆ తర్వాత కనుమూరి చిన్నబాబు నాయుడి ఫ్యామిలీని పరామర్శించారు. పాకాల మండలంలోనే నెద్రగుంట గ్రామంలో చిన్నబాబు కుటుంబానికి ధైర్యం చెప్పారు. వారికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు.


అక్టోబరు 31 జైలు నుంచి విడుదలైన చంద్రబాబు 
టీడీపీ అధినేత చంద్రబాబు అక్టోబరు 31న రాజమండ్రి(Rajahmundry) జైలు నుంచి విడుదలయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ (Skill Development)కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు(AP High Court) మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన్ను జైలు నుంచి విడుదల అయ్యారు. తమ అధినేత విడుదల కావడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకుని చంద్రబాబుకు స్వాగతం పలికారు. 52 రోజులుగా జైలులో ఉన్న చంద్రబాబును చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. రాజమండ్రి నుంచి విజయవాడకు రావడానికి 14గంటల సమయం పట్టింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నపుడు కూడా బేగంపేట విమానాశ్రాయం నుంచి జూబ్లీహిల్స్ వరకు జనం ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కావడంతో యాత్రకు ఫుల్ స్టాప్ పడినట్లేనా ఆసక్తికర టాక్ నడుస్తోంది.