JC Prabhakar Reddy Meet YS Vijayamma: ఏపీ రాజకీయాల్లో సోమవారం సంచలన పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy).. వైఎస్ విజయమ్మతో (YS Vijayamma) భేటీ అయ్యారు. హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో విజయమ్మతో సమావేశమయ్యారు. విజయమ్మ ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అరగంట పాటు వీరి సమావేశం జరగ్గా.. ఈ భేటీలో ఎలాంటి రాజకీయాలు లేవని.. మామూలుగానే కలిశారనే జేసీ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. కాగా, వైఎస్ హయాంలో జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉంది. వైఎస్ కేబినెట్‌లో ఆయన మంత్రిగానూ పనిచేశారు. తాజాగా, వైఎస్ విజయమ్మతో జేసీ సమావేశం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.


జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ


విజయమ్మతో తాను భేటీ కావడం ఇప్పటికే బాగా చర్చనీయాంశం అయినందున ఈ వ్యవహారంపై జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ‘‘నేడు హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్ళగా.. వెయిటింగ్ లాంజ్ లో వైఎస్ విజయమ్మ కనిపించడంతో ఆమె బాగోగుల గురించి పలకరించి మాట్లాడటం జరిగింది. ఈ కలయికలో ఎటువంటి రాజకీయ ప్రత్యేకత లేదు’’ అని క్లారిటీ ఇచ్చారు.


Also Read: Minister Convoy: మంత్రి వాహనం ముందు బట్టలిప్పి యువకుల వీరంగం - మద్యం మత్తులో హల్‌చల్, పోలీసులు ఏం చేశారంటే?