Why are YSRCP senior leaders not coming out : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రులు, మాజీ మంత్రులు, ఇతర సీనియర్ల బలగం కనీసం యాభై మంది వరకూ ఉంటారు. పార్టీ ఓడిపోక ముందు వీరు తరచూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారు. ఇప్పుడు ఒకరిద్దరు తప్ప ఎవరూ కనిపించం లేదు. జిల్లాల్లో కనీసం పార్టీ క్యాడర్ కూ కనిపించడం లేదని చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని పిలుపునిస్తున్నా చాలా మంది స్పందించడం లేదు. కొంత మంది తప్పనిసరిగా పార్టీ ఆఫీసుకు, కార్యక్రమాలకు వస్తున్నా నోరు తెరవడం లేదు. కొత్త ప్రభుత్వంపై అప్పుడే విమర్శలు ఎందుకుని చాలా మంది అనుకుంటున్నారు.
ఘోరమైన ఓటమితో నేతల మైండ్ బ్లాంక్
వైసీపీ ఓటమి చిన్నది కాదు. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ సీనియర్ నేతలు అనే ట్యాగులున్న వారు కూడా వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరోసారి పార్టీకి భవిష్యత్ ఉందా లేదా అన్న స్థాయిలో ఫలితాలు వచ్చాయి. ఉత్తరాంధ్ర వైసీపీ లో కింగులుగా ఉన్న ధర్మాన, బొత్స వంటి వారు ఘోరంగా ఓడిపోయారు. వారే కాదు.. కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో పరాజయం పాలయ్యారు. ఉత్తరాంధ్రలో కూటమి నేతలకు వచ్చిన మెజార్టీలు చూస్తే.. తమ ఐదేళ్ల పాలనపై ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో వైసీపీ ముఖ్యులకు అర్థమయింది. అందుకే వీలైనంత వరకూ సైలెన్స్ పాటించడం మంచిదని అనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఆవేశపడి ప్రయోజనం లేదని అనుకుంటున్నారు.
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసు, బెంగళూరులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్
నోరున్న నేతలూ నోరు తెరవలేకపోతున్నారు !
వైసీపీ హయాంలో నోరున్న నేతలకు మంచి పలకుబడి ఉండేది. చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టి దడదడలాడించేవారు. రోజా దగ్గర నుంచి కొడాలి నాని వరకూ ఓ పది మంది ఇలాంటి ప్రెస్ మీట్లకు ప్రసిద్ధి. ఇప్పుడు అడపాదడపా పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ మాత్రమే ప్రెస్ మీట్ పెడుతున్నారు. వినుకొండలో జరిగిన హత్యాయత్నం ఘటనపై గుంటూరుకు చెందిన నేతలెవరూ ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు.. విశాఖలో ఉన్న గుడివాడ అమర్నాత్ ఆ బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. ఓడిపోయినప్పటి నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరికీ కనిపించలేదు. బడ్జెట్ పై శ్వేతపత్రం తర్వాత హఠాత్తుగా హైదరాబాద్ లో ప్రత్యక్షమైన ప్రెస్ మీట్ పెట్టారు. మిగిలిన నేతలు ఆ మాత్రం దర్శనం కూడా ఇవ్వకపోతూండటంతో వైసీపీ క్యాడర్ కూడా కంగారు పడుతోంది.
ప్రభుత్వానికి టార్గెట్ కాకుండా ఉండటానికేనా ?
వైసీపీ హయాంలో టీడీపీ నేతల్ని.. వ్యక్తిగత శత్రువులుగానే చూశారు. ఎక్కడ అవకాశం దొరికి అక్కడ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. ఆస్తుల విధ్వంసం చేశారు. వారాంతాల్లో బుల్ డోజర్లతో విరుచుకుపడేవారు. ఇలాంటి పరిణామాలతో ఐదేళ్ల పాటు టీడీపీ నేతలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మాకు అధికారం అందితే మీ సంగతి చూస్తామంటూ టీడీపీ నేతలు ఎన్నో సార్లు హెచ్చరించారు. ఇప్పుడు వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో... వారిని రెచ్చగొట్టడం ఎందుకన్న ఉద్దేశంలో ఎక్కువ మంది సీనియర్ నేతలు సైలెంట్ గా ఉన్నట్లుగా భావిస్తున్నారు. వీరిలో ఎంత మంది పార్టీలో ఉంటారో.. ఎంత మంది ఉండరో కూడా స్పష్టత ఉండటం లేదు. ఏ పార్టీలో చాన్స్ లేకపోయినప్పటికీ గుంటూరులో ఇప్పటికే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పారు.
'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
పార్టీ నేతల్ని కాపాడుకోవడం కష్టమే !
జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి టీడీపీని మరింత రెచ్చగొట్టేలా ఉండటంతో.. అది ఆయన కన్నా పార్టీ నేతలకే ఎక్కువ ముప్పు వచ్చేలా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే పీకల్లో సమస్యల్లో మునిగిపోయి ఉంటే.. ఆయన ఎప్పుడై యాభై ఏళ్ల కిందట చంద్రబాబును కొట్టారని అదే కోపమని.. సరికొత్త రూమర్ ను ప్రచారంలోకి తీసుకు వచ్చారు. ఇది పెద్దిరెడ్డికి మరింత సమస్యగా మారనుంది. వైసీపీ ముఖ్యనేతలు ఇప్పటికిప్పుడు గతంలో తాము చేసిన వ్యవహారాలకు సంబంధించి తమను తాము కాపాడుకోవడమే కీలకమన్నట్లుగా ఉన్నారు. లఅందుకే ఎవరూ పెద్దగా నోరు తెరవడం లేదని.. ముందుకు రావడం లేదని అంటున్నారు.