Chandrababu Challenge to CM Jagan on Rapthadu Siddam Meeting: అనంతపురం జిల్లా రాప్తాడులో 'సిద్ధం' సభకు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), సీఎం జగన్ (CM Jagan)కు సవాల్ విసిరారు. ఈ సభలో పలు ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 'రాప్తాడు అడుగుతోంది. జాకీ పరిశ్రమ ఎందుకు తరిమేశావని? అనంత అడుగుతోంది కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని? రాయలసీమ రైతన్న అడుగుతున్నాడు నాటి డ్రిప్ పథకాలు ఎక్కడని.? సమాధానం చెప్పి సభ పెడతావా.? లేక సభలోనే సమాధానం చెబుతావా.?.' అంటూ ట్వీట్ లో ప్రశ్నించారు.
Chandrababu: 'రాప్తాడు అడుగుతోంది, వీటికి సమాధానం చెప్పు' - సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్
Ganesh Guptha | 18 Feb 2024 01:04 PM (IST)
Andhrapradesh Politics: టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదివారం రాప్తాడు సభలో వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు (Image Source: Twitter)