తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. దీని కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలోని ప్రముఖులకు ఆహ్వానం వెళ్తోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ జగన్ మోహన్ రెడ్డిని అహ్వానించారు. ఆయనతోపాటు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబును పిలిచారు. తెలంగాణ మాజీ సీఎం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కూడా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పిలిచారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌కి కూడా ఆహ్వానం అందింది. 


తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానాలు అందాయి. ఎన్నికల్లో సహాయక సహకారాలు అందించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌తోపాటు గాదె ఇన్నయ్య, హరగోపాల్‌, కంచె ఐలయ్యను ఆహ్వించారు. వివిధ కుల సంఘాల లీడర్లను కూడా ఆహ్వానం పలికారు. 


ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు సీనియర్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా సహా ఇతర నేతలందర్నీ ఆహ్వానించారు. ప్రత్యేకంగా వారందరితో సమావేశమై తనకు పదవీ బాధ్యతలు అప్పగించనందుకు కృతజ్ఞతలు చెబుతూనే గురవారం జరిగే పదవీ ప్రమాణోత్సవానికి హాజరుకావాలని రిక్వస్ట్ చేశారు. వీళ్లతోపాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్యను, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కార్యక్రమానికి ఇన్వైట్ చేశారు.


తెలుగు రాష్ట్రాల్లో వేరే పార్టీ నేతల ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లే పరిస్థితి గతం నుంచి లేదు. ఈసారి అలాంటి పరిస్థితి కనిపించనుందా అంటే అనుమానంగా ఉంది. జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ వెళ్లారు. ఇప్పుడు మరి తెలంగాణ సీఎం ప్రమాణానికి ఏపీ సీఎం జగన్ వస్తారా అనేది అనుమానంగానే ఉంది.   


మరోవైపు రేవంత్ రెడ్డిని సీఎల్పీగా ఎన్నుకట్టు గవర్నర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలియజేశారు. ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ సంతకాలు చేసిన పత్రాన్ని రాజ్‌భవన్‌కు పంపించారు.