Sharmila accused Jagan: సోషల్ మీడియా లో నేను ఒక బాధితురాలినని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తనను  సునీత ను అమ్మను ఎలా బడితే అలా మాట్లాడారు. అసభ్యకరంగా పోస్టులు పెట్టాలని చెప్పింది జగన్ మోహన్ రెడ్డి నేనని స్పష్టం చేశారు. జగన్ వద్దు అని చెప్పి ఉంటే ఇవి అప్పుడే ఆగేవన్నారు.   జగన్ నోరు విప్పి ఉంటే అప్పుడే చెక్ పడేదన్నారు.  సోషల్ మీడియా లో మా మీద అబద్ధాలు చెప్పారు..అక్రమ సంబంధాలు అంట గట్టారు. బూతులు కూడా తిట్టారని మండిపడ్డారు.  ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టారు. ఒక సైతాన్ సైన్యం తయారయ్యింది. వీటికి చెక్ పడాలన్నారు.  మహిళలు రాజకీయాల్లో ఉండాలంటే భయపడే పరిస్థితి కి తెచ్చారని.. మా కుటుంబాల్లో కింద కామెంట్లు చదవొద్దు అనే చెప్పే పరిస్థితి ఉందన్నారు.  సోషల్ మీడియా కి ఒక లిమిట్ ఉండాలి.. ఒక  రేగ్యులేటరీ ఉండాలన్నారు.  పట్టుకున్న వాళ్ళు అంతా విషనాగులు కానీ వీళ్ళ వెనుక ఉన్న అనకొండ ను పట్టుకోవాలి.. వాళ్ళపై కఠినంగా శిక్షలు ఉండాలని డిమాండ్ చేశారు.           


Also Read: తెరపైకి డిజిటల్ కార్పొరేషన్ స్కామ్ - సోషల్ మీడియా కేసుల్లో అరెస్టయిన వారికి జీతాలుగా ప్రజాధనం ?


ప్రజాతీర్పును గౌరవించాలని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ..  మాజీ సీఎం జగన్‌కు హితవు పలికారు. మిమ్మల్ని గెలిపించింది ప్రజలు మీకు భాధ్యత లేదా అని ప్రశ్నించారు.  ప్రతిపక్ష హోదా లేక పోతే మైకూ ఇవ్వరని అంటున్నారని మైకు ఇవ్వక పోవడం మీ స్వయం కృతాపరాథమన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన షర్మిల జగన్ తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.  ఒకప్పుడు 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 11 సీట్లు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు ? మీ అక్రమాలను,అవినీతిని ప్రజలు గమనించారు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారని గుర్తు చేశారు.  మీకు ప్రజల తీర్పు మీద గౌరవం ఉండాలి కదా అసెంబ్లీ పోను అనడం అహకారానికి నిదర్శనమన్నారు. 


వైసిపి ఎంఎల్ఏ లను అడుగుతున్నాం.. మీకు ప్రజలు ఓట్లు వేశారు.. ఎంఎల్ఏ అంటే మెంబర్ ఆఫ్ అసెంబ్లీమీకు ఆలోచన లేదా అని షర్మిల ప్రశ్నించారు.  ప్రజలు మీకు ఓట్లు వేసింది అసెంబ్లీ వెళ్ళడానికేనని..  అసెంబ్లీ కి పోకుంటే మీరు ప్రజలను వెన్నుపోటు పొడిచినట్లేనని స్పష్టం చేశారు.   జగన్ కి అహంకారం ఉంది. మీకు ఏమయ్యింది. ఇంట్లో కూర్చొని మాట్లాడటానికి కాదు కదా మీకు ఓట్లు వేసింది మీ అజ్ఞానం ఎంటో బయట పడిందని మండిపడ్డారు. 


Also Read: ఆర్జీవీకి తప్పదు - ప్రకాశం జిల్లాలో కేసు నమోదు !


వైసిపి ఎంఎల్ఏ లకు ఇది భావ్యం కాదని..  బడ్జెట్ ప్రవేశ పెడుతుంటే సర్కార్ ను ప్రశించేది ఎవరుని ప్రశ్నించారు.  ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేది ఎవరు .. సర్కార్ దంధాలను ప్రశ్నించేది ఎవరు .. అని ప్రశఅనించారు.  ఎన్నికల్లో నిలబడ్డప్పుడు అసెంబ్లీ కి పోను అని మీరు ప్రజలకు చెప్పాల్సిందని మండిపడ్డారు.  మీకు దైర్యం సామర్థ్యం లేకుంటే రాజీనామా చేయాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలందరికీ లేఖలు రాస్తున్నామన్నారు.