Sentiment is again being highlighted in Telangana politics: తెలంగాణలో సమీపంలో ఎన్నికలు లేవు. మరో నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి. కేంద్రం జమిలీ ఎన్నికలు ఆలోచన చేస్తే.. మరో ఐదారు నెలలు ఆలస్యం అవుతుంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలను లోక్ సభతోనే కలుపుతుంది కానీ ముందే నిర్వహించరు. అయినా రాజకీయాలు మాత్రం వేడి తగ్గడం లేదు. పోటాపోటీగా అధికార విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి. తాజాగా సెంటిమెంట్ రాజకీయాలు కూడా ప్రారంభించాయి. దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించగా.. తెలంగాణ ఏర్పాటు ప్రకటనను చిదంబరం చేసిన డిసెంబర్ 9ను అంత కంటే ఎక్కువగా ఘనంగా నిర్వహించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. 


దీక్షా దివస్‌కు బీఆర్ఎస్  భారీ ఏర్పాట్లు 


తెలంగాణలో ఉత్సవాల రాజకీయం జోరుగా నడుస్తోంది.  కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విజయోత్సవాలకు ప్లాన్ చేసుకున్నాయి. కాకపోతే ఎవరికి వారి విజయోత్సవాలు. కేసీఆర్  తెలంగాణ కోసం ఆమరణదీక్ష ప్రారంభించిన రోజును దీక్షా దివస్‌గా చేసుకోవాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.  అధికారంలో ఉన్నప్పుడు కూడా దీక్షా దివస్ నిర్వహించేవారు. కానీ అప్పట్లో క్యాడర్ సాదాసీదాగా చేసుకునేది. అధికార  పార్టీగా ఉండటంతో అంత ఊపు ఉండేది కాదు.కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రభుత్వంపై పోరాటం  చేయాల్సిన అవసరంలో ఉన్నారు. అందుకే ఘనంగా చేయాలని జిల్లాల వారీగా ఇంచార్జుల్ని నియమించారు. ర ాజకీయంగా యాక్టివ్ గా ఉండటానికి ఇది చాలా అవసరం కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ క్యాడర్ మొత్తం మళ్లీ ఉద్యమం ద్వారా  స్ఫూర్తిని మనసులో రగిలించుకుని పోరాడాల్సిన సమయం ఆసన్నమయిందని కేటీఆర్ అంటున్నారు. 



Also Read: Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?




కాంగ్రెస్ పార్టీ డిసెంబర9ని సెలబ్రేట్ చేయడానికి రెడీ అయింది. ఆ రోజున ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటన చేశారు . ఆ రోజు సందర్భంగా కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని  సంబరాలు చేయబోతున్నారు.  సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు.  తెలంగాణ తల్లి విగ్రహం ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో బీఆర్ఎస్ ఫైనల్ చేసిన విగ్రహం కాదు. అంతే కాదు పాలనలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మూడో తేదీన బహిరంగసభ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. రాహుల్ లేదా ప్రియాంక గాంధీల్లో సభకు.. రాజీవ్ గాందీ విగ్రహావిష్కరణకు  వచ్చేలా రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు. 


Also Read: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?


మళ్లీసెంటిమెంట్ రాజకీయాలు !


తెలంగాణ అంటే ఓ ఎమోషనల్ . పొలిటికల్ గా ఎంతో బలమైన ఆయుధం. ఇప్పుడు రెండు పార్టీలు మళ్లీ ఈ ఆయుధాన్ని తమ వద్దకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని సులువుగా అర్థం చేసుకోవచ్చు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం ద్వారా చాలా నష్టపోయామని అనుకుంటున్న టీఆర్ఎస్ మరోసారి పాత చరిష్మాను పొందాలంటే ఉద్యమ గుర్తులన్నీ మళ్లీ ప్రజల ముందు ఉంచాలని అనుకుంటోంది. అందులో భాగంగానే దీక్షాదివస్  చేస్తోంది. కాంగ్రెస్కూడాడ సోనియా  గాంధీ అంగీకరించకపోతే అసలు తెలంగాణ వచ్చేదే కాదని తెలంగాణ తల్లి సోనియా అని అంటున్నారు. వీరి పోటాపోటీ రాజకీయం మరోసారి తెలంగాణ రాజకీయాలను హీటెక్కించనుంది.