Sajjala On Gorantla :   హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో అంటూ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వీడియో వివాదంపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ అంశంపై గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారని.. విచారణ జరుగుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తన వీడియోను మార్ఫింగ్ చేశారని ఆయన చెబుతున్నారని సజ్జల అన్నారు. అది మార్ఫింగా కాదా అనే అంశం విచారణలో తేలుతుందన్నారు. ఇలాంటి వాటిని తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు. 


తప్పు చేసిన వారికి గుణపాఠం చెప్పేలా శిక్ష ఉంటుదన్న సజ్జల


ఆ వీడియో మార్ఫింగ్ అయితే .. ఆ పని చేసిన  వారు మరోసారి అలా ఎవరూ చేయకుండా గుణపాఠం చెప్పేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదే సమయంలో మార్ఫింగ్ కాదని తేలితే తమ ఎంపీని కూడా ఉపేక్షించబోమని అదే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉదయం నుంచి సోషల్ మీడియాలో గోరంట్ల మాధవ్ వీడియో వైరల్ అయింది. తెలుగుదేశం పార్టీ నేతలు ఎంపీపై విరుచుకుపడ్డారు. అనేక రకాల మీమ్స్‌తో ట్రోలింగ్ చేస్తున్నారు. 


కాన్వాయ్ ఆపి ఓ తల్లి ఆవేదన విన్న సీఎం జగన్, సాయం అందించాలని కలెక్టర్ కు ఆదేశాలు


టీడీపీ నేతలు మార్ఫింగ్ చేశారని గోరంట్ల మాధవ్ విమర్శలు


అయితే ఆ వీడియో పూర్తి స్థాయిలో మార్ఫింగ్ అని ఎంపీ గోరంట్ల మాధవ్ చెబుతున్నారు. ఈ వీడియో గురించి ఆయన దృష్టికి రాగానే పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అసలు తన వీడియో ఇదని ఓ వీడియోను చూపించారు. తాను జిమ్ చేస్తున్న వీడియోను మార్పింగ్ చేశారని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన చింతకాయల విజయ్‌తో పాటు మరో ఇద్దరు కుట్ర చేశారని తాను ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు. 


ఉప ఎన్నికలా ? ముందస్తు ఎన్నికలా ? తెలంగాణలో ఏం జరగబోతోంది ?


పార్టీ ఇమేజ్‌కు డ్యామేజ్ కలిగేలా ఉండటంతో  దృష్టి సారించిన వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్


అయితే ఈ అంశంలో ఇంకా అనేక అనుమానాలు ఉన్నాయి. గోరంట్ల మాధవ్ ఇలా న్యూడ్‌గా మాట్లాడారని ఎవరూ బహిరంగంగా ఆరోపించలేదు. అది ప్రైవేట్ వీడియోగా చెబుతున్నారు. కానీ మార్ఫింగ్ అని ఎంపీ వాదిస్తున్నారు. చట్టపరంగా ఈ వీడియోలో కేసులు పెట్టేంత ఏమీ లేకపోయినా నైతిక పరంగా వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందికరంగా మారింది. అందుకే నిజమో కాదో తేల్చి చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్‌సీపీ పెద్దలు నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.