CM Jagan : సీఎం జగన్ కాన్వాయ్ వస్తుంది. రోడ్డు పక్కన జనం మధ్యలో ఓ మహిళ తన చిన్నారితో ఎదురుచూస్తుంది. ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆగింది. వెంటనే అధికారులు పరిగెత్తుకుంటూ ఆ మహిళ వద్దకు వెళ్లి సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆ మహిళ తన గోడును సీఎంకు చెప్పుకుంది. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. 


ఓ తల్లి ఆవేదన 


సీఎం జగన్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్ తునిలో జనాల మధ్య ఓ తల్లి కుమారుడితో ఉండడాన్ని గుర్తించారు. వెంటనే సీఎం జగన్ కాన్వాయ్ ఆపి దిగి తల్లిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.  కుమారుడి ఆరోగ్య పరిస్థితిని వివరించిన తల్లి తనూజ, ఆదుకోవాలని సీఎం జగన్ ప్రాధేయపడింది. చిన్నారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని సమస్యను పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్‌కు సీఎం ఆదేశించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన తనూజ ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడి అనారోగ్య సమస్యను వివరించడంతో అప్పటికప్పుడు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు సీఎం జగన్. 


వివాహ వేడుకలో పాల్గొన్న సీఎం జగన్ 


అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ కుమార్తె వివాహానికి సీఎం జగన్ గురువారం హాజరయ్యారు. వివాహ వేడుకలో పాల్గొన్న సీఎం జగన్ వధువు డయానా చంద్రకాంతం, వరుడు సుధీర్‌ కుమార్‌లను ఆశీర్వదించారు. గురువారం ఉదయం గం10.30లకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం, తుని రాజా కాలేజీ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. అక్కడ మంత్రులు దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్‌ నాథ్‌ సీఎం జగన్ కు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పాయకరావుపేట చేరుకుని వివాహ కార్యక్రమంలో పాల్గొని సీఎం జగన్ వధూవరులను ఆశీర్వదించారు.


మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి


నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి మానవవత్వం చాటుకున్నారు. నెల్లూరులో గురువారం భారీ వర్షం కురిసింది. నెల్లూరులోని మాగుంట లే అవుట్ అండర్ బ్రిడ్జిలోకి మోకాళ్లలోతు నీరు చేరింది. వర్షంలో తడుస్తూనే తనవంతు సాయం అందించారు. ఓ పెళ్లికి హాజరయ్యేందుకు నెల్లూరుకి వచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి బ్రిడ్జి ముందే ఆగిపోయారు. కార్పొరేషన్ అధికారులకు ఈ విషయం చెప్పి మోటార్లతో నీటిని తోడాలని అధికారులను ఆదేశించారు. పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటం ముహూర్తానికి టైం అవుతుండడంతో సాహసం చేసిన ఇద్దరు వాహన చోదకులు బ్రిడ్జి దాటే ప్రయత్నం చేశారు. వారి కారు మధ్యలో ఆగిపోయింది. జనం వారిని చూసినా ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. వెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్షంలో తడుస్తూనే తన అనుచరులతో కలిసి నీటిలో ఆగిపోయిన వాహనాలను నెట్టారు. ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగటంతో మిగిలిన వాళ్లు కూడా అక్కడికి వచ్చారు. 


Also Read : Jagananna Videshi Vidya Deevena : విదేశాల్లో చదవాలనుకునేవారికి గుడ్ న్యూస్, విదేశీ విద్యాదీవెనకు దరఖాస్తులు ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం