దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతున్న సినిమా 'సీతారామం'(SitaRamam). మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. రీసెంట్ గా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. దానికి ప్రభాస్ గెస్ట్ గా వచ్చారు. దీంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది.
రేపే విడుదల కాబోతున్న ఈ సినిమాకి సెన్సార్ భారీ షాకిచ్చింది. గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా రిలీజ్ కు సెన్సార్ నో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మతపరమైన సన్నివేశాలు ఉన్నాయని.. దాని కారణంగానే గల్ఫ్ లో సినిమాను రిలీజ్ చేయొద్దంటూ సెన్సార్ బోర్డు ఆదేశించినట్లు వార్తలొస్తున్నాయి. అయితే తమ సినిమాను గల్ఫ్ దేశాల్లో రిలీజ్ చేయడానికి చిత్రబృందం మరోసారి సెన్సార్ బోర్డ్ ముందుకు వెళ్లనుందని సమాచారం.
మరి సెన్సార్ బోర్డ్ నిజంగానే గల్ఫ్ కంట్రీస్ లో ఈ సినిమాను బ్యాన్ చేస్తుందా..? లేక అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి రిలీజ్ కు అనుమతి ఇస్తారా..? అనేది చూడాలి. హనురాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రష్మికా మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: మళ్ళీ నిఖిల్‌ను వెనక్కి పంపారు - ఆగస్టు 12న కాదు, తర్వాత రోజున 'కార్తికేయ 2'
Also Read: నాగ చైతన్య నవ్వితే డేటింగ్‌లో ఉన్నట్టేనా? ఆమెతో ప్రేమ నిజమేనా?