రైతు సంఘర్షణ సభ ( Raitu Sangharshana Sabha ) ద్వారా దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు రాహుల్‌ గాంధీ ( Rahul gandhi ) వచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ( Telangana )  రైతుల జీవితాల్లో వెలుగులు నింపి వారు పండించిన పంటను చివరి గింజ వరకు కొనే వరకు కాంగ్రెస్‌ ( Congress ) బాధ్యత తీసుకుంటుందని రైతు సంఘర్షణ సభ వేదికగా హామీ ఇచ్చారు.  కేంద్రంలో ప్రభుత్వం కూలిపోయినా..  ఆనాడు కరీంనగర్‌లో ఇచ్చిన మాట ప్రకారం.. ఎన్ని కష్టాలు వచ్చినా.. పార్లమెంట్‌ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారని మోదీ ( PM Modi )  చెప్పారన్నారు. మోదీ మాటలు నిజమేనని.. అంతా వ్యతిరేకించినా... తెలంగాణ రాష్ట్రం ఇచ్చామన్నారు.

  


ఒక్క చాన్స్ ఇవ్వండి - అది రైతు డిక్లరేషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ, బాధ్యత : రాహుల్


సోనియా ( Sonia ) తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోయి ఉంటే.. వందేళ్లయినా  తెలంగాణ ( Telangana )  రాకపోయి ఉండేదన్నారు.  ఇన్ని త్యాగాలు చేసి.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల బాగుచేయాలని రైతులు ఆనందంగా ఉండాలని... విద్యార్థులు ( Students )  చదువకోవాలి... నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని, బడుగు బలహీన వర్గాలు బాగుపడాలని తెలంగాణ ఇస్తే... నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలు నలుగురు చేతిలో బందీ అయ్యారు. నిజాం కంటే కేసీఆర్‌ వారసులు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ప్రజలెవరికీ మేలు జరగలేదు.. కన్నీళ్లు, ఆత్మహత్యలే ప్రతి పల్లె, ప్రతి ఊరిలో కనిపిస్తున్నాయి. వద్దురో రామచంద్రా.. ఈ కేసీఆర్‌ పాలన.. ఎవరైనా వచ్చి ఈ పాలన అంతమొందిస్తే బాగున్ను అనుకుంటున్నారు. ప్రజలు... ్లాంటి వారికి తోడు ఉండేందుకు మీరు సిద్ధమేనా... రాహుల్‌తో కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు.  


రూ. 2 లక్షల రుణమాఫీతో పాటు మరెన్నో వరాలు - కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్‌లో కీలక అంశాలు ఇవిగో


సభ ప్రారంభానికి ముందు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలని రాహుల్ గాంధీ పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సక్సెస్ అయ్యారు.. రాహుల్ రాక ముందే సభా ప్రాంగణం నిండిపోయింది. 


టీఆర్ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదు, గీత దాటితే ఎవరైనా గెంటివేతే - పార్టీ నేతలకు రాహుల్ మాస్ వార్నింగ్