తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేటీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఈ ఆగ్రహావేశాలు ఎప్పుడూ ఉంటాయి. అయితే ఇప్పుడు కేటీఆర్ నేతల ఆగ్రహం రాజకీయమే కానీ.. ప్రజలకు సంబందం లేని రాజకీయం. అదేమిటంటే తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్‌ను కేటీఆర్ బ్లాక్ చేశారు. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా కేటీఆర్ ఉదయం ఓ ట్వీట్ చేశారు. స్టడీ టూర్‌కు రాహుల్ గాంధీకి స్వాగతం అని అందులో పేర్కొన్నారు. 



ఆ ట్వీట్‌కు రేవంత్ రెడ్డి రిప్లయ్ ఇయ్యారు. ఈ రిప్లయ్‌ను తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ రీ ట్వీట్ చేసింది.




ఆ తర్వాత అనూహ్యంగా తెంలగాణ కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్‌ను ఆయన బ్లాక్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు వెంటనే విమర్శలు చేశారు. తమను కేటీఆర్ బ్లాక్ చేశారని స్క్రీన్ షాట్ తీసి పెట్టి..పిరికి పింకీ అని ప్రారంభించారు. 



తర్వాత  ట్విట్టర్ పిట్ట తోకముడిచింది. ప్రశ్నను చూసి గజగజ వణికింది. ప్రజల తరపున అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఒక జాతీయ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ను బ్లాక్ చేయడం కేటీఆర్ మానసిక స్థితికి అద్దం పడుతోందని మరో ట్వీట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మామిగం  ఠాగూర్ కూడా స్పందించారు. కేటీఆర్ ట్విట్టర్‌ను తాము అసలు పట్టించుకోబోమన్నారు. 



కేటీఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీట్విట్టర్ హ్యాండిన్ బ్లాక్ చేసింది తన పర్సనల్ అకౌంట్ నుండే. మామూలుగా అయితే అసభ్యకరంగా కామెంట్లు పెట్టే వారిని ఎక్కువ మంది బ్లాక్ చేస్తూ ఉంటారు. ఓ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్‌ను బ్లాక్ చేయడం అసాధారణమే. ఎందుకు బ్లాక్ చేశారన్నదానిపై కేటీఆర్ వైపు నుంచి కానీ.. ఆయన టీం వైపు నుంచి కానీ స్పష్టత లేదు.