ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పోరాటానికి ప్రజా ఉద్యమం నిర్మించాలని.. అందరూ కలసి రావాలని .. అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandra babu ) ఇచ్చిన ఏపీ రాజకీయవర్గాల్లో చర్చకు కారణం అయింది. ఇంతకు ముందు ఓట్లు చీలనీయబోమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) ప్రకటించడంతో రెండు పార్టీల మధ్య పొత్తులు పొడుస్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. చంద్రబాబు పిలుపుపై జనసేన ( Janasena ) కీలక నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. తమ పార్టీ విధానం ఇప్పటికే ప్రకటించామన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని ఇప్పటికే పవన్ కల్యాణ్ చెప్పామన్నారు. భారతీయ జనతా పార్టీతో ( BJP ) ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయని అయితే. .. తెలుగుదేశం పార్టీతో ( TDP ) పొత్తుపై పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారన్నారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై పోరాటం చేయడమే తమ లక్ష్యమన్నారు.
త్యాగాలకు సిద్ధమన్న చంద్రబాబు- పవన్‌కు సూచనలు పంపించారా ?
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) , టీడీపీ ( TDP ) తర్వాత జనసేన పార్టీకే ఎక్కువ ఓటింగ్ షేర్ ఉంది. గత ఎన్నికల్లో ఆరు శాతానికిపైగా ఓట్లు వచ్చాయి. చాలా నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలను ఆ ఓట్లు తారుమారు చేశాయి. అందుకే జనసేన పార్టీ.. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే సమీకరణాలు మారిపోతాయన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో విడిగా పోటీ చేస్తే అది వైఎస్ఆర్‌సీపీకి ప్లస్ అవుతుందని ప్రభుత్వ వ్యతిరేక ఓటు ( anti incumbency ) చీలిపోతుందన్న విశ్లేషణలు వినపిిస్తున్నాయి. అందుకే ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే ఓట్లు చీలకుండా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు. ఓట్లు చీలనివ్వబోమని ముందుగా పవన్ కల్యాణ్ ప్రకటించారు...త్యాగాలకు సిద్దమని చంద్రబాబు చెప్పారు. దాంతో రెండు పార్టీలు పొత్తుల దిశగా అడుగులు వేస్తున్నాయని భావిస్తున్నారు.
అత్యాచార ఘటనల్లో టీడీపీ నేతల ప్రమేయం ఉంటే ఎన్ కౌంటర్ చేసేయండి : సోము వీర్రాజు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ , చంద్రబాబు వేర్వేరుగా మాట్లాడినప్పటికి కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని నమ్ముతున్నారు. చంద్రబాబు పొత్తుల కోసం పోరాటం చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఎవరెన్ని పార్టీలతో కలసి వచ్చినా జగన్ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తారని ప్రకటించారు.