ప్రభుత్వంపై పోరాటానికి అందరూ కలిసి రావాలని .. ప్రజా ఉద్యమానికి టీడీపీ నాయకత్వం వహిస్తుందన్నారు. అవసరమైతే త్యాగాలకూ సిద్ధమని ప్రకటన చేశారు. ప్రజల కోసం తీవ్రవాదులతో పోరాడుతున్నామని..  ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వంపై ఇతర తీవ్రమైన విమర్శలు చే్సినప్పటికీ..  అందరూ కలిసి రావాలని.. త్యాగాలకు సిద్ధమని చంద్రబాబు చేసిన కామెంట్లే ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పార్టీ ఆవిర్భావ సభ నుంచి ప్రభుత్వంపై పోరాటానికి అందరూ కలవాలన్నారు. ఓట్లు చీలనీయబోమని ప్రకటించారు. ఆ సమయంలోనే రాజకీయ త్యాగాలు కూడా చేయాలన్నారు. చంద్రబాబు ఇప్పుడు ఆ దిశగా స్పందించినట్లుగా భావిస్తున్నారు. 


తెలుగుదేశం పార్టీ - జనసేన పొత్తు పెట్టుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికపోయే అవకాశం లేకపోగా..  సామాజికవర్గ సమీకరణాలు కూడా అనుకూలంగా మారుతాయని దాని వల్ల ప్రభుత్వాన్ని సులువుగా ఓడించవచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి.  వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందని.. ఇలాంటి సమయంలో వ్యతిరేక ఓట్లు చీలికపోకూడనది పవన్ కల్యాణ్ అంటున్నారు. చంద్రబాబు కూడా ఇ్పపుడు అదే టోన్‌లో వాయిస్ వినిపించడంతో రెండు పక్షాల నుంచి సానుకూలత వ్యక్తమయినట్లుగా భావిస్తున్నారు. 


అయితే ప్రస్తుతం జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది. తాము టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని ఎక్కడా.. ఎప్పుడూ జనసేన చెప్పడం లేదు. ఓట్లు చీలనివ్వబోమనే చెబుతున్నారు. దానర్థం టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే ఎక్కువ మంది నమ్ముతున్నారు. టీడీపీతో పొత్తు విషయంలో బీజే్పీలోని ఓ వర్గం తీవ్ర వ్యతిరేకతతో ఉంది. మరో వర్గం మత్రం టీడీపీతో కలిసి వెళ్లాలని ఢిల్లీలో లాబీయింగ్ చేస్తోందని చెబుతున్నారు. అదే సతమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై టీడీపీలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సీపీఐ పార్టీ తెలుగుదేశం, జనసేతో కలిసి పనిచేస్తామని చెబుతోంది. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో ముందు ముందు కీలక మార్పులు చోటు చే్సుకునే అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు తాజా ప్రకటన ద్వారా క్లారిటీ వస్తున్నట్లుగా రాజకీయవర్గాలు అంచనాకు వస్తున్నాయి. 


అయితే తెలుగుదేశం పార్టీ వర్గాలు మాత్రం చంద్రబాబు పొత్తుల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. ప్రజా పోరాటల గురించే మాట్లాడారని అంటున్నారు. ఎన్నికల సమయంలోనే పొత్తుల గురించి చర్చిస్తరాని ఇప్పుడు ప్రభుత్వంపై ప్రజా ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.  అయితే పొత్తుల దిశగా తొలి అడుగు పడిందని...  గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న పొత్తుల దిశగా  రాజకీయాలు వెళ్తున్నాయని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు.