తెలంగాణలో ఖాళీగా ఉన్న ఒక రాజ్యసభ స్థానం కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను జారీ చేసింది. ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదల కానుండగా, 30 తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు  జరగనుంది.  మరో  రెండున్నరేళ్ల పదవీకాలం ఉండగానే బండా ప్రకాశ్‌తో రాజీనామా చేయించి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. ఆ స్థానానికి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. అభ్యర్థి ఎంపికపై కేసీఆర్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  సీనియర్ నేత , మాజీ ఎంపీ ప్రస్తుత ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్  బోయినపల్లి వినోద్ కుమార్‌ను రాజ్యసభకు పంపాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.  ఢిల్లీ లో రాజకీయ వేడి దృష్టా అనుభవజ్ఞుడైన వినోద్ వైపే మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. సుదీర్ఘ కాలం ఎంపీగా ఉన్న వినోద్ కుమార్‌కు  పలు జాతీయ , ప్రాంతీయ పార్టీలతో  మంచి పరిచయాలు ఉన్నాయి. చాలా కాలంగా టీఆర్ఎస్ ఢిల్లీ వ్యవహారాలను చక్క బెడుతున్నారు. ఈ క్రమంలో ఆయన సేవలు ఢిల్లీలో మరింత విస్తృతంగా ఉపయోగించుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 


రాహుల్ సభకు కోమటిరెడ్డి హాజరుపై క్లారిటీ, సోదరుడు మాత్రం దూరమే!


జూన్‌లో మరో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. కెప్టెన్ లక్ష్మికాంతరావు, డిఎస్ ఇద్దరి రాజ్యసభ గడువు పూర్తయిపోతుంది. వారికి మళ్లీ అవకాశం కల్పించే్ చాన్స్ లేదు. కెప్టెన్ లక్ష్మికాంతరావు వయోభారంతో ఉన్నారు. డీఎస్ పార్టీకి దూరంగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకే వారి స్థానంలో కొత్త వారికి చాన్సివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ ఇద్దరు రాజ్యసభ స్థానాలు ఎవరికి దక్కుతాయో కానీ ఆసావహులంతా తీవ్ర ప్రయత్నాలుచేస్తున్నారు. 


హీటెక్కుతున్న తెలంగాణ పాలిటిక్స్ - TRS నేతలకు, కవితకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
 
దేశ రాజకీయాలపై, ఫోకస్ పోట్టిన గులాబీ అధినేత కేసీఆర్ రాజ్యసభకు ఎంపిక చేసేవారు తెలంగాణ గళాన్ని బలంగా వినిపించేలా, అండగా నిలిచేలా ఉన్న నేతలు, రాజకీయాలపై పట్టుండి, మాట్లాడేవారిని ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దళితబంధును ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్రంలో అమలు చేస్తుండటంతో ఆ విషయాన్ని దేశమంతా ప్రచారం చేసేందుకు ప్రధాన ఆస్త్రంగా ఉపయోగపడేలా దళితులకు ఒక రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తారని చెబుతున్నారు. మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల్ని ఒకే సారి ప్రకటించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్టీ నేతల నుంచి ఒత్తిడి ఎక్కువ అయితే ప్రస్తుతానికి బోయిన్ పల్లి వినోద్ కుమార్ పేరు ఒక్కటే్ ప్రకటించి...   మిగిలిన పేర్ల ప్రకటనను వాయిదా వేసే అవకాశం ఉంది.