తెలంగాణను కేంద్రం తీసుకుంటున్నదే ఎక్కువ.. ఇస్తున్నది తక్కువ అని దీనిపై తాను చర్చలు సిద్దమని ఇటీవల కేటీఆర్ చాలెంజ్ చేశారు. ఈ చాలెంజ్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ రోజు స్పందించారు. కేటీఆర్ బాగా రెచ్చిపోయి మాట్లాడారని.. మత్తు ఎక్కువై మాట్లాడినట్టు అర్థం అయిందన్నారు. 2014 నుంచి ఇవాళ్టి వరకు మన రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో రూ.365797 కోట్లు కట్టినట్లు అందులో నుంచి తిరిగి రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది రూ. 168647 కోట్లు అని కేటీఆర్ చెప్పారన్నారు. అంటే 2 లక్షల కోట్లు కేంద్రం వద్దే ఉన్నాయని లెక్క చెప్పారన్నారు.
బండి సంజయ్ కనబడటం లేదు, సిరిసిల్ల టీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన
ఇప్పుడు తాను అసలు లెక్కలు చెబుతున్నానని అరవింద్ వివరాలు వెల్లడించారు. కేంద్రం నుంచి వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలుకు తెలంగాణ కు ఇచ్చింది రూ. 114585 కోట్లు, జాతీయ రహదారుల మీద 92,000 కోట్లు ఇచ్చారన్నారు. వీటిలో మొన్న గడ్కరీ 8000 కోట్లతో రహదారులను ప్రారంభించారని గుర్తు చేశారు. రైల్వేస్ మీద 14000 కోట్లు, కోవిడ్ కోసం 18600 కోట్లు, ఫ్రీ రేషన్ కి 2961 కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. అంటే మోడీ వాపసు ఇచ్చింది 3,94,000 కోట్లు అన్నారు. తన లెక్క తప్పయితే.. కేటీఆర్ మగ పుట్టుక పుట్టి ఉంటే.. తాను చెప్పిన లెక్కలు అబద్దమని రుజువు చేయాలన్నారు.
వ్యవసాయరంగం దయనీయ స్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణం, రాహుల్ గాంధీకి మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ
ఫ్రీ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ చేసుకున్న సన్నాసి కేటీఆర్ అని అరవింద్ మండిపడ్డారు. కేసీఆర్ చేయని వాగ్దానం లేదని 8 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాడని.. అందులోనూ ఉర్దూ చేర్చారని మండిపడ్డారు. ఉర్దూ ఎవడు రాస్తారు.. బొందు గాడు రాస్తడు... బొందుగాడే దిద్దుతాడు అని మండిపడ్డారు. తెలంగాణ లో కూడా రామరాజ్యం రావాలన్నారు. వరి రైతులను ఆగం చేశారని.. అన్ని వ్యవస్థలను నాశనం చేసి.. తెలంగాణ ను అధోగతి పాలు చేశారని విమర్శించారు.
తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు షెడ్యూల్ విడుదల
తాను జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి వస్తూంటే అడుగడుగునా పోలీసులే ఉన్నారని.. ప్రభుత్వం మారే సమయంలో పోలీసులు ఇలానే వ్యవహరిస్తారని సెటైర్ వేశారు. పోలీసుల మొహంలో బీజేపీ జెండా చూస్తే సంతోషం తో ఆహ్వానిస్తున్నారని.. పాలమూరు లో నడ్డా సభకు ఇంత ఆదరణ చూసి కేసీఆర్ కు గుండెపోటు వస్తుందేమోనని సెటైర్ వేశారు.