Telangana News: తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నిక (Bypoll for Rajyasabha Seat) నోటిఫికేషన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాశ్ తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. మే 12న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మే 19గా ఉంటుంది. మే 30న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అనంతరం ఓట్లను లెక్కిస్తారు.
బండ ప్రకాశ్ (Banda Prakash) రాజీనామాతో ఖాళీ అయిన సీటు
బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ రాజ్యసభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకత్వం ఎవరితో భర్తీ చేస్తుందో అనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో ప్రకాష్ (Banda Prakash) రాజీనామా చేయడం, ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. రాజీనామా చేసే సమయానికి బండ ప్రకాష్‌కు రాజ్యసభ సభ్యుడిగా ఇంకా రెండేళ్లకు పైగా పదవీకాలం ఉంది. రాజ్యసభ ఎంపీతో పాటు నామినేటేడ్ పదవుల కోసం టీఆర్ఎస్ (TRS) నేతలు చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అయితే వచ్చే ఏడాదిలో తెలంగాణ రాష్ట్రంలో (Telangana State) ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో పార్టీకి పనికొచ్చే వారికి రాజ్యసభ స్థానం కట్టబెట్టే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
2018లో బండ ప్రకాష్ (Banda Prakash) కు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (KCR) రాజ్యసభ పదవిని కట్టబెట్టారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ (Banda Prakash) ను రాజ్యసభకు పంపారు. అయితే అనుహ్యాంగా గత ఏడాది బండ ప్రకాష్ ను రాజ్యసభ ఎంపీ (Bypoll for Rajyasabha Seat) పదవికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీని చేశారు. ఈ ఒక్క స్థానానికి టీఆర్ఎస్ చీఫ్ ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ గులాబీ వర్గాల్లో నెలకొంది. పదవుల ఎంపిక విషయంలో టీఆర్ఎస్ చీఫ్ అనుహ్య నిర్ణయాలు తీసుకుంటారనే చర్చ పార్టీ వర్గాల్లో ఉంది.
తెలంగాణలో మరో రెండు రాజ్యసభ స్థానాలు జూన్ మూడో వారంలో ఖాళీ అవుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు వెళ్లిన డి. శ్రీనివాస్ (D. Srinivas) కెప్టెన్ లక్ష్మీకాంతరావుల (Captain Lakshmikanth Rao) పదవీ కాలం జూన్‌లో ముగియనుంది.