Stock Market @ 12 PM: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) గురువారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. బెంచ్మార్క్ సూచీలు ఉదయం నుంచీ జోరుగా సాగుతున్నాయి. ఆర్బీఐ రెపో రేట్ల పెంపుతో బుధవారం నష్టపోయిన మార్కెట్లు మరుసటి రోజే కోలుకున్నాయి. ఆర్బీఐ నిర్ణయాల తాలూకు ఫలితాలను అంచనా వేయడంతో మదుపర్లు మళ్లీ కొనుగోళ్లు చేపట్టారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 16,878 వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 660 పాయింట్ల లాభాల్లో ఉంది. బుధవారం రూ.7 లక్షల కోట్లు నష్టపోయిన మదుపర్లు నేడు రూ.3 లక్షల కోట్లు ఆర్జించారు.
BSE Sensex
క్రితం సెషన్లో 55,669 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 56,255 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. ఉదయం నుంచే కొనుగోళ్ల సందడి కొనసాగింది. 56,566 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. 55,976 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 660 పాయింట్ల లాభంతో 56,337 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
బుధవారం 16,677 వద్ద ముగిసిన ఎన్ఎస్ఈ నిఫ్టీ గురువారం 16,854 వద్ద ఓపెనైంది. ఉదయం నుంచి దూకుడుగా కదలాడింది. 16,945 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. 16,778 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 200 పాయింట్ల లాభంతో 16,878 వద్ద కొనసాగుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో కొనసాగుతోంది. ఉదయం 35,705 వద్ద మొదలైంది. 35,550 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,934 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో 503 పాయింట్ల లాభంతో 35,764 వద్ద ట్రేడ్ అవుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 40 కంపెనీలు లాభపడగా 10 నష్టాల్లో ముగిశాయి. టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, ఓఎన్జీసీ, ఇన్ఫీ, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా కన్జూమర్, నెస్లే ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, బ్రిటానియా, అపోలో హాస్పిటల్స్ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. రియాల్టీని మినహాయిస్తే మిగతా రంగాల సూచీలన్నీ లాభాల్లో ఉన్నాయి. ఆటో, బ్యాంక్, మెటల్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్యూ బ్యాంక్, పవర్ సూచీలు 1-2 శాతం ఎగిశాయి.