Konda Vishweshwar Reddy :   బీజేపీ నేత బండి సంజయ్‌ను ( Bandi Sanjay ) మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలిశారు. అంతకుముందు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డితో విశ్వేశ్వర్‌రెడ్డి సమావేశమయ్యారు. సంజయ్‌తో భేటీకి జితేందర్‌రెడ్డితో కలిసి వచ్చారు. సంజయ్‌తో భేటీ అనంతరం విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.  తండ్రీకొడుకులను ఓడించాలని.. కేసీఆర్, కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  బండి సంజయ్ వెంటే తెలంగాణ ( Telangana ( సమాజం ఉందని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. అయితే పార్టీలో చేరుతారా లేదా అన్నదానిపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. 


పసుపు బోర్డు తెచ్చే వరకూ ఎక్కడికక్కడ అడ్డుకొనుడే - నిజామాబాద్‌ ఎంపీపై కవిత ఫైర్ !


టీఆర్ఎస్  ( TRS )  ఎంపీగా చేవెళ్ల నుంచి గెలిచిన తర్వాత ఆ పార్టీ అగ్రనాయకత్వంతో విభేధాలు రావడంతో బయటకు వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. అయితే కాంగ్రెస్‌లోనూ ఆయన ఇమడలేకపోయారు. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక తర్వాత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.ఆ తర్వాత ఆయన పలు పార్టీల నేతలతో భేటీ అయ్యారు.  ఇంత వరకు ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదు. అప్పట్లో ఈటల బీజేపీలో చేరే సమయంలో కొండా కూడా కాషాయ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జరిగింది. 


తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు ఆపే కుట్ర- కేంద్రంపై మంత్రి గంగుల సంచలన ఆరోపణలు


రేవంత్ రెడ్డితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ ( T PCCC CHIIEF ) అయిన తర్వాత ఆయనతో ఓసారి సమావేశం అయ్యారు. ఆయన కూడా కాంగ్రెస్‌లో మళ్లీ చేరుతానన్న సంకేతాలు పంపారు. అయితే ఇంత వరకూ చేరలేదు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి లక్ష్యం  టీఆర్ఎస్‌ను ఓడించడం. అయితే తాను ఏపార్టీలో అయినా చేరితే ఆ పార్టీ టీఆర్ఎస్‌కు మిత్రపక్షంగా మారితే తన పరిస్థితి ఏమిటని ఆయన ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఎవరు పోరాడుతారో వారితోనే ఉంటానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు.


ఉర్దు భాషపై ఉరుముల్‌ మెరుపుల్‌- తెలంగాణలో సరికొత్త వివాదం


అయితే  అన్ని రాజకీయా పార్టీలతోనూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టచ్‌లో ఉంటున్నారు. ఆయన ఏ పార్టీలో చేరుతారన్నది చివరి వరకూ సస్పెన్స్‌గా ఉండే అవకాశం ఉంది.