తెలంగాణను ఆగం చేసిన కేసీఆర్‌తో కలిసే ప్రసక్తే లేదని వరంగల్ రైతు సంఘర్షణ వేదికగా రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇకపై ఈ ప్రశ్న ఏ కాంగ్రెస్‌ కార్యకర్త నాయకుడు అడిగినా బహిష్కరిస్తామని ప్రకటించారు.  వాళ్లెవరైనా ఎంత పెద్దవాళ్లైనా సరే పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు.  ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్‌ఎస్, బీజేపీ నేతలతో సంబంధాలు పెట్టుకున్నా పార్టీని విడిచిపెట్టి పోవచ్చునని  అలాంటి వ్యక్తులు కాంగ్రెస్‌ కు అవసరం లేదని తేల్చి చెప్పారు. సిద్ధాంత పరమైన పోరాటం చేసి టీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 


టీఆర్‌ఎస్ - బీజేపీ మధ్య ఒప్పందం ఉందని రాహుల్ గాంధీ ారోపించారు.  పార్లమెంట్‌లో మోదీ నల్లచట్టాలు తీసుకొస్తే దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా టీఆర్‌ఎస్ మద్దతు పలికిందని గుర్తు చేారు.  అందుకే ఈ రెండు పార్టీలు ఒక్కటేనన్నారు. తెలంగాణలో నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి లేదని బీజేపీకి తెలుసన్నారు. అందుకే బీజేపీ రిమోట్ కంట్రోల్‌ ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలుసుకొని బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఒక్కటయ్యారని రాహుల్ విమర్శించారు.  తెలంగాణ ప్రభుత్వం ఎంత అవినీతి చేసినా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈడీ ద్వారా కానీ ఇతర దర్యాప్తు సంస్థల ద్వారా గానీ విచారణ చేయించడం లేదని గుర్తు  చేశారు. 


జనాల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేసిన వాళ్లకే టికెట్లు ఇస్తాం... మెరిట్ ఆధారంగానే టికెట్లు ఇస్తాం... ఎన్నికల సమయం వచ్చే వరకు ఇలాంటి ప్రస్తావన తీసుకురావద్దు. ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉన్న వాళ్లకే టికెట్లు ఇస్తాం. ఎంత పెద్దవాళ్లైనా సరే టికెట్‌ ఇచ్చేది లేదన్నారు. ఎవరైనా మెరిట్ ఆధారంగానే టికెట్‌ ఇస్తామన్నారు రాహుల్


సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ఓ కల ఉందని.. ఆ కల నెరవేరాలని  సోనియా గాంధీ ఆకాంక్షించారని రాహుల్ గాంధీ తెలిపారు. రాష్ట్రం ఇస్తే కల నెరవేరుతుందని అనుకున్నారు. ఆమెతోపాటు మనమంతా అనుకున్నాం. కానీ ఏం జరుగుతుందో చూస్తున్నారు. ఇకపై ఆ కల కోసం మనమంతా ఒకటిగా పని చేద్దామని పిలుపునిచ్చారు.  మీకు నా అవసరం ఎక్కడున్నా ఎప్పుడున్ననా... తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఎలాంటి అంశం ఉన్నా ఎప్పుడు రమ్మన్నా మీ తరపున వచ్చి పాల్గొంటానని  భరోసా ఇచ్చారు.  సమస్య ఏదైనా కాంగ్రెస్‌ మీ తరఫున పోరాడుతుందని భరోసా ఇచ్చారు.  


రైతులకు భరోసా ఇచ్చేందుకు ర్యాలీ చేపట్టాం. మీటింగ్ పెట్టుకున్నాం. రిక్లరేషన్ కూడా ప్రకటించామని.. కాంగ్రెస్ ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని రాహుల్ హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్య వచ్చినా పోరాటం చేస్తుందన్నారు.  రాబోయే కాలంలో ఆదివాసులకు సంబంధించి ఇలాంటిసభ నిర్వహిస్తామని... వాళ్లు పది శాతం రిజర్వేషన్ కోసం ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారన్నారు.   దానికి మద్దతు ఇస్తూ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.