Revanth framing BJP to target BRS With farm house case: ఫార్ములా వన్ ఈ రేసు స్కాంలో  కేటీఆర్‌ను విచారణ చేయడానికి ఏసీబీ అధికారులు గవర్నర్ పర్మషన్ అడిగారు. కానీ ఇప్పటి వరకూ అనుమతి రాలేదని చెబుతున్నారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి బీజేపీ నేతలను కేటీఆర్ సంప్రదించారని ఇటీవల ఢిల్లీ పర్యటన అందుకేనని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అది నిజమో కాదో కానీ కేటీఆర్ విచారణకు మాత్రం ఇంకా గవర్నర్ పర్మిషన్ రాలేదు. 


బీజేపీపై ఒత్తిడి పెంచే వ్యూహం 


బీఆర్ఎస్‌ విషయంలో బీజేపీ కాస్త సానుకూలంగా ఉండకుండా చూసేందుకు రేవంత్ రెడ్డి తన వంతు ప్రయత్నాలు విభిన్నంగా చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీజేపీ నేతల్ని కేసీఆర్ ఇరికించారని అభిప్రాయాలు ఉన్న ఫామ్ హౌస్‌ కేసును రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా బయటకు తీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ ఎపిసోడ్‌లో  ఉన్న నలుగురు మాజీ ఎమ్మెల్యేలతో పాటు మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందులో చిరుమర్తి లింగయ్య  పోలీసుల ఎదుట హాజరయ్యారు.  ప్రస్తుతం ట్యాపింగ్ కేసులో జైల్లో ఉన్న తిరుపతన్న ఫోన్ నెంబర్లు అడిగితే ఇచ్చాను కానీ ట్యాపింగ్ చేయించలేదన్నారు.  


Also Read: Tummala Nageswararao: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన 


బీజేపీ అగ్రనేతల్ని టార్గెట్ చేసిన కేసీఆర్ ? 


ఫామ్ హౌస్ కేసు సీబీఐకి వెళ్లింది. ఆ కేసు విచారణ మాత్రం సీబీఐ చేయడం లేదు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. సీబీఐ విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు.  సీబీఐ సైలెంట్ అయిపోయింది. అది కేవలం ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు మాత్రమే. అందులో ట్యాపింగ్ అంశం కూడా ఇమిడి ఉంది.  ఇప్పుడు రేవంత్ ట్యాపింగ్ కోణంలో ఆ కేసును వెలుగులోకి తెస్తున్నారు. ఆ కేసు మొదట ట్యాపింగ్‌తో ప్రారంభమయిందని బీఆర్ఎస్ లో గుసగుసలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం పోలీసులు ఈ ఫామ్ హౌస్ కేసు కూడా ట్యాపింగ్ వల్లే బయటపడిందని లీకులు ఇచ్చారు.  ట్యాపింగ్ చేస్తున్న సమయంలో బీజేపీతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేల గురించి తెలిసిందని వారిని ట్రాప్ చేసి.. బీజేపీ పెద్దల్ని ఇరికించేందుకు కేసీఆర్ కుట్ర ఉన్నారని అంటున్నారు. కేసీఆర్ అధికారికంగా చాలా కీలకమైన డాక్యుమెంట్లు రిలీజ్ చేశారు. అవి ట్యాపింగ్ చేసి సేకరించినవేనని అప్పట్లోనే బీజేపీ ఆరోపించింది.  ఈ క్రమంలో ఈ నలుగురు ఎమ్మెల్యేల విచారణ తర్వాత వేరే కోణంలో ఫామ్ హౌస్ కేసు వెలుగులోకి వస్తుందని భావిస్తున్నారు. 



Also Read: Family Survey Applications: రోడ్డు పక్కన కుప్పలుగా సమగ్ర కుటుంబ సర్వే దరఖాస్తు ఫారాలు, గతంలో ప్రజాపాలన అప్లికేషన్లు!




ఈ కేసు వెలుగు చూసినప్పుడు  బీఎల్ సంతోష్ ను అరెస్టు చేసేందుకు కేసీఆర్ ప్రత్యేక విమానంలో పోలీసుల్ని పంపారని చెబుతున్నారు. అయితే అరెస్టు చేయలేకపోయారు. తర్వాత తెలంగాణకు వచ్చిన బీఎల్ సంతోష్ పరిణామాలను తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పుడు  బీజేపీ నేతతలు అవి మర్చిపోయారేమో అని చెప్పి రేవంత్ ఈ కేసు ద్వారా గుర్తు చేయాలని అనుకుంటున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు.  కేసీఆర్, కేటీఆర్ లపై చర్యలు తీసుకోకుండా బీజేపీ అడ్డుపడికుండా ఆయన ఈ వ్యూహాలు పన్నుతున్నారంటున్నారు. మరి రేవంత్ ప్రయత్నాలు ఫలిస్తాయా ?