Senior MLA Jyotula Nehru: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు. కానీ కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఆ లోటు రానీయడం లేదు. గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. తాజాగా జగ్గంపేట సీనియర్ టీడీపీ (TDP) ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇసుక విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఉచిత ఇసుక విధానం (Free Sand Policy) వల్ల సమస్యలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని  దీనిపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు.  ఇసుక అమ్మకాల్లో అధికారుల జోక్యాన్ని తగ్గించాలని పూర్వకాలంలో ఉన్న విధానాన్ని  తీసుకు రావాలన్నారు. 


ఎవరికి ఇసుక అవసరం అయితే వాళ్లు తవ్వి తెచ్చుకునే పద్దతి తేేవాలన్న జ్యోతుల నెహ్రూ             


ఎవరికి ఇసుక అవసరమైతే వాళ్లు తెచ్చుకునే విధానంలో గతంలో ఉండేదని జ్యోతుల నెహ్రూ గుర్తు చేశారు. అంటే ఎవరికి కావాల్సినంత వారు కూలీలను, వాహనాలను తెచ్చుకుని వారికి కావాల్సింది వారు తవ్వుకుని పోయేలా ఉండాడలన్నారు.  అదే విధానంతో దీని అమ్మకాలను నిరోదిస్తే  పై ప్రాంతాలు, పై రాష్ట్రాలకు పోకుండా ఆపగలుకుతామని జ్యోతుల నెర్హూలు స్పష్టం చేశారు.   నెహ్రూ అన్నారు. అవసరమైన వాళ్లే ఉచిత ఇసుకను తెచ్చుకునేలా, వాళ్లే తవ్వుకుని, వాళ్లే రవాణా చేసుకునే వెసలుబాటు కల్పించినట్టయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నతన అభిప్రాయం అన్నారు.


Also Read:  ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాలు నిస్సారం - వైసీపీ సభకు వచ్చేలా టీడీపీ చర్చలు జరపదా ?


సమయం అయిపోయిందని ఇతర సభ్యులకు అవకాశం ఇవ్వాలన్న రఘురామ             


ఇసుక తర్వాత మట్టి విషయంపై మాట్లాడేందుకు జ్యోతుల నెహ్రూ ప్రయత్నించారు. అయితే ఆయనకు కేటాయించిన సమయం కంటే ఎక్కువ మాట్లాడారని  డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు  కొత్త సభ్యలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. తనను ప్రతిపక్షంగా చూడొద్దని.. అసెంబ్లీకి రావొద్దంటే రానని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తర్వాత ఆయన  కూర్చుండిపోయారు. జ్యోతుల నెహ్రూ నేరుగా అసెంబ్లీలో విమర్శలు చేశారు కానీ బయట మీడియా ముందు గతంలో ఇలాంటి విమర్శలు చేశారు. ఉచిత సిలిండర్ల పథకం విషయంోలనూ అవే ఆరోపణలు చేశారు. ఉచితం అని చెప్పిన తర్వాత లబ్దిదారులు బుక్ చేసుకుని డబ్బులు కడితే వారి అకౌంట్లలో ప్రభుత్వం జమ చేస్తోందని అది ఉచితం ఎలా అవుతుందని అంటున్నారు.


Also Read: ఏపీ శాసనమండలిలో లోకేష్ ఉగ్రరూపం - సైలెంట్ అయిపోయిన వైసీపీ ఎమ్మెల్సీలు - ఇదీ జరిగింది !


తనను ప్రతిపక్షంగా చూడొద్దన్న జ్యోతుల నెహ్రూ                 


ప్రభుత్వంపై జ్యోతుల నెహ్రూ ఇలా వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తండటంతో ఆయనపై టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఆయనకు మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి ఉందని అంటున్నారు. చంద్రబాబు ఆయనతో మాట్లాడితే అంతా సర్దుకుంటుందని అంటున్నారు. తాను ఇలా మాట్లాడుతున్నాను కాబట్టి తనను ప్రతిపక్షం అనుకోవద్దని జ్యోతుల నెహ్రూ అంటున్నారు.