Nara Lokesh fired on YCP members in AP Legislative Council: శానమండలిలో వైసీపీ సభ్యులపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిని నిండు సభలో అవమానించారని లోకేష్ మండిపడ్డారు. తాము అలాంటి వ్యాఖ్యలను సమర్థించబోమని బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా చెప్పారు.అయితే అలాంటి వారికి టిక్కెట్లు ఎందుకు ఇచ్చారని లోకేష్ ప్రశ్నించారు.               

Continues below advertisement


వైసీపీ సభ్యులు సభకు రాకపోవడంపై మంత్రి డోలా విమర్శలు                   


ముందుగా శాసనమండలిలో  మాట్లాడుతున్న సమయంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోవడంపై స్పందించారు.  జగన్ అసెంబ్లీ రాకుండా పారిపోయడని విమర్శించారు. అయితే తమ అధినేత ప్రస్తావన తెచ్చి విమర్శలు చేయడంపై మంత్రి డోలా పై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014 - 19 మద్యలో చంద్రబాబు పారిపోయారని విమర్శించారు. 


Also Read: సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు


చంద్రబాబు కూడా గతంలో రాలేదన్న వైసీపీ సభ్యులు -  ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్ 


వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు రెండేళ్లు సభలో పోరాడారని గుర్తు చేశారు.   నా తల్లిని అవమానపరడంతోనే సభ నుంచి చాలెంజ్ చేసి వెళ్లిపోయరన్నారు.  చంద్రబాబు సభకు రాకపోయినా మా ఎమ్మెల్యేలు సభకు వచ్చారని గుర్తు చేశారు.  వైసిపి ఎమ్మెల్యేలు ఎందుకు సభకు రావడం లేదో చెప్పాలని లోకేష్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా బొత్స స్పందించారు. మీ తల్లిని అవమానించిన వారిని మేం ప్రోత్సహించమని బొత్స చెప్పుకొచ్చారు. అయితే  గత ఎన్నికలలో టికెట్లు ఇస్తే ప్రోత్సహించినట్లు కాదా అని ప్రశ్నించారు. ఈ సందర్బంగా జగన్ కుటుంబంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని కొంత మంది వైసీపీ సభ్యులు అన్నారు. 


Also Read: సోషల్‌ మీడియాలో పెట్టే అసభ్యకర పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు- కేసులు పెడితే తప్పేంటని ప్రశ్న


మీ తల్లిని కించ పరిచిన వారిని ప్రోత్సహించబోమన్న బొత్స                        


దీనిపై నారా లోకేష్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జగన్ కుటుంబాన్ని ఎక్కడ అనుచితంగా మాట్లాడామో చూపించాలని మండిపడ్డారు. లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వైసీపీ ఎమ్మెల్సీలు సైలెంట్ అయ్యారు. 


అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు కానీ.. శాసనమండలికి మాత్రం ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు.  ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు.  అందుకే ఎమ్మెల్యేలు కూడా సభకు వస్తే బాగుంటుందన్న అభిప్రాయం బయట నుంచి వినిపిస్తోంది.