టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR ) తనను రాజ్యసభకు  పంపుతారన్న విషయం తనకు తెలియదని ప్రకాష్ రాజ్ ( Prakash Raj ) ప్రకటించారు. ఈ విషయంపై మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదన్నారు. ఓ మంచి పనిని చెడగొట్టేందుకు ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.  తెలంగాణ రాష్ట్ర సమితి ( TRS ) తరపున రాజ్యసభ సభ్యునిగా ( Rajya Sabha ) ప్రకాష్‌రాజ్‌కు అవకాశం ఇవ్వబోతున్నారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోది. తెలంగాణలో ఇప్పటికే ఓ రాజ్యసభ స్థానంగా ఖాళీగా ఉంది. ఈ స్థానానికి ఎప్పుడైనా ఎన్నిక జరగొచ్చు. జూన్‌లో మరో ఇద్దరి రాజ్యసభ సభ్యత్వం ముగిసిపోతుంది. అన్నింటికీ కలిపి ఎన్నికలు నిర్వహించవచ్చు. 


గవర్నర్‌కు హెలికాఫ్టర్ ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం ! కేంద్రం విచారణ ?


ఈ మూడింటిలో ఒకటి ప్రకాష్ రాజ్‌కు ఇస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న కేసీఆర్ వివిధ ప్రాంతీయ  పార్టీలతో సమన్వయం చేసుకునే బాధ్యతలను ప్రకాష్ రాజ్‌కు ఇస్తారని చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ ( Fedarel Front ) ప్రయత్నాలు చేసినప్పుడు తమిళనాడు, కర్ణాటకల్లో కీలక నేతలతో భేటీకి వెళ్లారు. అనూహ్యంగా ఈ సారి కూడా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాల్లో ఆయన ముందు ఉన్నారు. ఏ పదవి లేకపోతే ప్రకాష్ రాజ్ ప్రయత్నాలు అంత సక్సెస్ కావని.. సమర్థంగా ప్రాంతీయ పార్టీలను సమన్వయం చేయలేరని అనుకున్నారేమో కానీ కేసీఆర్ రాజ్యసభ సభ్యత్వం ఇస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఇటీవల రాజీనామా చేసినా రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్  పదవి కాలం మరో రెండున్నరేళ్ల వరకూ ఉంటుంది. 


ప్రకాశ్‌రాజ్‌‌కు కేసీఆర్ బంపర్ ఆఫర్? ముంబయి టూర్‌లో అందుకే అలా జరిగిందా?


అది వచ్చేఎన్నికలు పూర్తయ్యే వరకూ ఉంటుంది. ఆ రాజ్యసభ స్థానాన్ని ప్రకాష్ రాజ్‌కు కేటాయిస్తే వచ్చే ఎన్నికల వరకూ ఆయన కేసీఆర్ జాతీయ రాజకీయాల బాధ్యతలను సమన్వయం చేసుకుంటారన్న అంచనాలో టీఆర్ఎస్ ( TRS ) వర్గాలు ఉన్నాయి. రాజ్యసభ సభ్యత్వాన్ని ఇస్తే ప్రకాష్ రాజ్ తిరస్కరించే అవకాశం లేదు. రాజకీయాలపై ఎంతో ఆసక్తితో ఉన్న ఆయన... ఈ దిశగా ముందడుగు వేస్తారు. బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేయడంలో ఆయన ఎంతో ఆసక్తిగాఉన్నారు. కేసీఆర్ కూడా బీజేపీకి వ్యతిరేకంగానే కూటమి కట్టే ఆలోచన చేస్తున్నారు.ఈ క్రమంలో టీఆర్ఎస్ తరపున ప్రకాష్ రాజ్ మరింత యాక్టివ్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ అధినేత వైపు నుంచి క్లారిటీ వస్తేనే ప్రకాష్ రాజ్ కు పదవిపై స్పష్టత వస్తుంది.