TDP Letter To DGP :   లోకేష్ పాదయాత్ర పై టీడీపీ నేతల్లో టెన్షన్ మెదలైంది. ఈనెల 27 నుండి పాదయాత్రకు టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి లోకేష్ రెడీ అవుతున్న తరుణంలో పోలీసులు అనుమతులు లభించలేదు.దీంతో ఆ పార్టి నేతలు డీజీపీకి రిమైండర్ పంపారు.  నారా లోకేష్ ఈ నెల 27 నుండి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. అయితే ఇందుకు అవసరం అయిన ముందస్తు అనుమతులు పై పోలీసులు నుండి ఎటువంటి స్పందన లభించలేదు. జనవరి 9వ తేదీన ఈ మెయిల్ ద్వారా, ఆంధ్రప్రదేశ్ డీజీపీకి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లిఖిత పూర్వకంగా అనుమతులు కోసం లేఖ వ్రాశారు. అంతే కాదు జనవరి పదో తేదీన లిఖిత పూర్వక లేఖ ను డీజీపీ కార్యాలయంలో కూడ సమర్పించారు. అయితే ఇందుకు సంబందించిన అనుమతులు పై టీడీపీ నేతలకు ఇంత వరకు ఎలాంటి రిప్లై రాలేదు. 


దీంతో ఈ వ్యవహరం పై పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. పాదయాత్ర తేది సమీపిస్తున్నప్పటికీ మీ వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. జనవరి 27 న మొదలు కానున్న పాదయాత్రకు త్వరగా అనుమతులు ఇవ్వండి వర్ల రామయ్య డీజీపీని కోరారు. అనుమతులు ఇస్తే అవరమైన ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా ఉంటుందని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు. పాదయాత్రకు సంబంధించిన సమాచారం కోసం అవసరం అయితే తెదేపా నేత బీద రవిచంద్ర, లోకేష్  పీఏ నరేష్ లను సంప్రదించవచ్చని వర్ల రామయ్య తన లేఖలో డీజీపీకి వివరించారు. 


నారా లోకేశ్ పాదయాత్రకు ఇంకా అనుమతి ఇవ్వకపోవటతోం మిగిలిన అంశాల పై కూడా ఆ పార్ట ీనేతలు ఆలోచనలు చేస్తున్నారు. ఎట్టి పరిస్దితుల్లో పాదయాత్ర నిర్వహించేందుకు అవసరం అయిన అన్ని మార్గాలను  నేతలు అన్వేషిస్తున్నారు. ప్రభుత్వం అనుమతులు ఇవ్వని పక్షంలో తీసుకోవాల్సిన చర్యలు పై  చర్చిస్తున్నారు.గతంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ పర్యటించారు. అదే సందర్బంలో ఆయన చేసిన పాత వ్యాఖ్యల రికార్డులను   టీడీపీ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది. పాదయాత్రకు అనుమతులు అవసరం లేదంటూ గతంలో జగన్ ఇచ్చిన స్టేట్ మేంట్స్ ను బయట పెడుతున్న టీడీపీ నేతలు,అనుమతులు విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారిన ప్రశ్నిస్తున్నారు.


అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా లోకేశ్ పాదయాత్ర జరిగి తీరుతుందని, వచ్చే శుక్రవారం ప్రారంభం కానున్న పాదయాత్రకు ఎన్ని ఆటంకాలు కల్పించినా ఎదుర్కొంటామని చెబుతున్నారు.  ఈనెల 27న మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్రలో తొలి అడుగు లోకేష్  వేయనున్నారని అంటున్నారు. పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకుంటే తీసుకోవాల్సిన చట్టపరమయిన అంశాల పై   పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు.అవసరం అయితే న్యాయస్దానాన్ని ఆశ్రయించి అయినా పాదయాత్రకు అనుమతులు తీసుకోవాలని భావిస్తున్నారు.ఇప్పటికే రాజదాని రైతుల పాదయాత్రకు   కోర్టు అనుమతి ఇచ్చినప్పటికి పోలీసులు వేధింపులకు గురి చేశారన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.  పార్టీ వాలంటీర్లు, ప్రత్యేక భద్రత, ప్రైవేట్ సెక్యూరిటితో పాదయాత్ర చేయాలని లోకేష్ భావిస్తున్నారు.