Narasimha Varahi Ganam to protect Sanatana Dharma soon: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హిందూత్వ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. తాజాగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకోవడం రకరకాల చర్చలకు కారణం అవుతోంది. నరసింహ వారాహి గణం పేరుతో త్వరలోనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తానని పవన్ ప్రకటించారు. ఇవి అదికారికంగా జనసేన పార్టీకి అనుబందంగా ఉన్నట్లుగా ప్రకటించినా ప్రకటించకపోయినా ఆ పార్టీ హిందూత్వ కార్యకర్తలే అందులో ఉంటారని అనుకోవచ్చు.
భజరంగ్ దళ్ తరహాలో జనసేన నరసింహ వారాహి గణం
ఈ నరసింహ వారాహి గణం ఏం చేస్తుందో పవన్ ఇంకా ప్రకటించలేదు. కానీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం అని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. బీజేపీకి ఇలాంటి గ్రూప్ భజరంగ్ దళ్ ఉంటుంది. అలాగే అనేక హిందూ సంస్థలకూ బీజేపీ పరోక్షంగా మద్దతు ఇస్తుంది. వాటి ఏర్పాటులోనూ కీలంగా వ్యవహరించింది. ఇప్పుడు భజరంగ్ దళ్ తరహాలో పవన్ కల్యాణ్ ఈ నారసింహ వారాహి గణాన్ని నియమించనున్నారని అనుకోవచ్చు. వాటిపై ప్రస్తుతానికి కసరత్తు జరుపుతున్నారని సనాతన ధర్మ పరిరక్షణకు ఏం చేయాలన్నది విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత కొత్త విభాగాన్ని ప్రకటించి అందులో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
సెక్యూలర్ పేరుతో హిందూత్వాన్ని కించ పర్చకూడదంటున్న పవన్
సెక్యూలర్ అన్న భావనతో హిందూ ధర్మాన్ని విమర్శించడం.. ఇతర మతాల విషయంలో సైలెంట్ గా ఉండటాన్ని పవన్ ప్రశ్నిస్తున్నారు. అన్ని మతాల పట్ల ఒకే రకమైన భావన ఉండాలని ఆయన అంటున్నారు. హిందువుల్లో చాలా మంది హిందూత్వాన్ని విమర్శిస్తూంటారు. హిందూత్వం అని చెప్పుకుంటే తమ వాదం అంటారు. అదే ఇతర మతాల్లో వారు అలాంటి ప్రవచనాలే చెబితే సెక్యూలరిజం అంటారు. ఇలాంటి వివక్షను పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తున్నారు. సనాతన ధర్మం అనేది ప్రజలకు మంచి చేయమనే చెబుతుంది కానీ అంట రాని తనాన్ని ప్రోత్సహించదని పవన్ అంటున్నారు. ఈ క్రమంలో హిందూత్వానికి ముప్పు ఉందని ఆయన భావిస్తున్నారు.
Also Read: YS Sharmila: ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు
అందుకే తిరుపతి లడ్డూల అంశం వచ్చినప్పుడు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. తిరుపతిలో వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. అందులో సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేకమైన బోర్డు జాతీయ స్థాయిలో ఉండాలన్నారు. పవన్ కల్యాణ్ ఇలా వ్యూహాత్మకంగా ఒక దాని తర్వాత ఒకటి హిందూత్వ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. నారసింహ వారాహి గణం ఏర్పాటైన తర్వాత రాజకీయంగానూ ఈ అంశం కలకలం రేపే అవకాశం ఉంది.