Nara Lokesh Delhi tour secrets are being hotly debated in TDP : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి నారా లోకేష్ తరచూ ఢిల్లీ వెళ్తుననారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ముఖ్యంగా అమిత్ షాతో తరచూ సమావేశం అవుతున్నారు. మీడియాకు తెలిసే ఆయన నాలుగైదు సార్లు సమావేశం అయ్యారని.. మీడియాకు తెలియకుండా ఇంకా చాలా సార్లు చర్చలు జరిపారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆదివారం నారా లోకేష్ ఢిల్లీ వెళ్లిన విషయమే చాలా మందికి తెలియదు. కానీ అమిత్ షాతో దాదాపుగా గంటసేపు చర్చించినట్లుగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
అమిత్ షాతో పలుమార్లు భేటీ అయిన లోకేష్
నారా లోకేష్ అధికారక సమవేశాల కోసం ఢిల్లీ వెళ్లారు. కానీ అధికారిక సమావేశాలు ఉన్నది సోమవారం.. ఆదివారం ఆయన అమిత్ షాతో సమావేశమయ్యారు.ఈ సమావేశ ఎజెండా ఏపీ ప్రభుత్వానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులేనని చెబుతున్నారు. కానీ అది పూర్తిగా రాజకీయ సమావేశం అన్న అభిప్రాయం కూడా ఉంది. చంద్రబాబునాయుడు పరిపాలన చూసుకుంటూంటే రాజకీయంగా నారా లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ వ్యవహారాలను ఆయనే చూసుకుంటున్నారు. ముఖ్యంగా రెడ్ బుక్ అమలు తన బాధ్యత అని నారా లోకేష్ చెబుతున్నారు. మద్యం స్కాంతో పాటు గనుల స్కాంలు ఇతర అవకతవకల విషయంలో జరిగిన చర్యలు తీసుకునే విషయంలో లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారని అంటున్నారు.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాక్, వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు
రెడ్ బుక్ అమలును చట్టబద్దంగా చేయాలని నారా లోకేష్ అనుకుంటున్నారు. అందులో భాగంగా ఎప్పటికప్పుడు ఏపీలో జరిగిన అవకతవకలు,స్కాములు, మనీలాండరింగ్ వంటి అంశాలపై సాక్ష్యాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నరని చెబుతున్నారు. వారి నుంచి వచ్చే సూచనల ఆధారంగానే చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. ఏపీలో మద్యం స్కాం అన్నింటికన్నా భారీగా జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సీఐడీ విచారణకు ఆదేశించారు. అంతర్గతంగా విచారణ జరుగుతోంది. డబ్బులు ఎక్కడి నుంచి ఎవరికి చేరాయి.. ఎలా మనీలాండరింగ్ జరిగింది అన్న వివరాలను కూడా సీఐడీ కనిపెట్టిందని.. ఒకే సారి ఈడీని కూడా రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వంపై సమన్వయం అంశంపైనా చర్చ ?
ఈ వ్యవహారాలతో పాటు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, నామినేటెడ్ పోస్టులు వంటి వాటిపైనా బీజేపీ పెద్దలతో నారా లోకేషే మాట్లాడుతున్నారని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నిధులు.. జాతీయ రాజకీయాల అంశాలను చంద్రబాబు చూసుకంటూ ఉంటే.. పూర్తిగా రాష్ట్ర రాజకీయ అంశాలను నారా లోకేష్ టేకోవర్ చేశారని చెబుతున్నారు. ఎక్కడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉండేందుకు స్వయంగా కొన్ని ముఖ్యమైన అంశాలను బీజేప పెద్దలకు చెబుతున్నట్లగా తెలుస్తోంది. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు నారా లోకేష్ ఢిల్లీలో కీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలోనే నారా లోకేష్ అందరికీ బాగా పరిచయమున్న నేత అయ్యారు.