Telangana Congress :  లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాదిగ సామాజికవర్గానికి టిక్కెట్ కేటాయించకపోవడంపై సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన  వ్యక్తం చేశారు.  టికెట్ దక్కలేదని నాకు బాధ లేదు నా జాతికి అవమానం జరుగుతుందన్నారు.  పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం కాదు ఎలాంటి న్యాయం జరుగుతుందో కనిపిస్తుందన్నారు.  ఇది దళిత జాతికి అవమానమని..  సరి చేసుకోక పోతే మూల్యం తప్పదని హెచ్చరించారు.                               


ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న మోత్కుపల్లి నర్సింహుపు.. తాను  కాంగ్రెస్ లోనే ఉంటా పార్టీ మారే ఉదేశం లేదన్నారు.  కాంగ్రెస్ పార్టీ లో మాదిగలకు అన్యాయం జరుగుతుంది.. మా జాతి హక్కు మాకు ఇవ్వటం లేదన్నారు.  పార్టీలో అంటరాని వారీగా మమల్ని చూస్తున్నారని..  బీజేపీ, బిఆరెస్ రెండేసి టికెట్స్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇచ్చిందని ప్రశ్నించారు.  అటెండర్ పోస్టులు ఇచ్చి గొప్పగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.  మందకృష్ణ మాదిగ మాట్లాడిన దాంట్లో తప్పు ఎం లేదన్నారు.  మా పార్టీ కి నష్టం జరగాలని నేను మాట్లాడటం లేదని..  గతం లో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసా .. ఎప్పుడు మాదిగలకు అన్యాయం జరగలేదన్నారు.                


కేసీఆర్ ని గద్దె దించిందే మాదిగలని..  17నియోజకవర్గాల్లో పార్టీకి నష్టం జరుగుతుందన్నారు.  కడియం శ్రీహరి ఏ కులామో ఆయనకె తెలీదని..  అయన ఓడిపోవడం పక్కా అని జోస్యం చెప్పారు.  ఒక్కో కుటుంబలో ఇద్దరిదరికి టికెట్ ఇచ్చారు మాదిగ వాళ్లు ఎం పాపం చేశారని మోత్కుపల్లి ప్రశ్నించారు.  రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి కావాలని కోరుకున్న వ్యక్తి ని తానని..  తన  మాటకు రెస్పెక్ట్ లేదు  .. ఇంతవరకు సీఎం అపాయింట్మెంట్ లేదన్నారు.  జరగబోయే పరిణామాలకు రేవంత్ రెడ్డి దే బాధ్యతని స్పష్టం చేశారు.   జితేందర్ రెడ్ది ఇంటికి పోయి రాత్రికి రాత్రికి పార్టీలో జాయినింగ్ వెంటనే పదవి ఇచ్చారని.. తా ము మాదిగ వలమనే కదా చిన్న చూపు అని ప్రశ్నించారు.  


మాదిగ వారు పార్లమెంట్ కి పోవొద్దా..  మేము మాట్లాడొద్దా అని  మోత్కుపల్లి ప్రశ్నించారు.  రాహుల్, సోనియా గాంధీ చెప్పేది ఒకటి ఇక్కడ జరిగేది ఒకటన్నారు.  సర్వేలు అన్ని బోగస్, ముఖ్యమంత్రి ఎవరికీ అనుకుంటే వారికీ టికెట్ వొస్తుందన్నారు.  ఇప్పటికైనా తేరుకొకపోతే..పార్టీకి నష్టం కలుగుతుందన్నారు.  రేపు ఇదే అంశం పై ఒక్క రోజు దిక్ష చేస్తున్నానని మోత్కుపల్లి ప్రకటించారు. మాదిగ సామాజికవర్గం అయిన కడియం శ్రీహరి కుమార్తెకు వరంగల్ టిక్కెట్ ఇచ్చారు. అయితే ఆయన ఉపకులానికి చెందిన వారు. అదే సమయంలో ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరగానే టిక్కెట్ కేటాయించడంతో కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.