Gudivada Amarnath :  చంద్రబాబు స్నేహితులు మోసం , దగా, వంచనేనని ఏపీ మమంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శిచారు. రాష్ట్రం అప్పుః రూ. 8 లక్షల కోట్లు అయిందని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని.. గత మూడేళ్ళలో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు, కాగ్ లెక్కల ప్రకారం రూ.1.15 లక్షల కోట్లు మాత్రమేనని కాగ్ చెప్పిందన్నారు. మరి ఈ 8 లక్షల కోట్ల లెక్క ఎక్కడ నుంచి వచ్చిందని చంద్రబాబును ప్రశ్నించారు.  ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం గత కాలపు అప్పులకు కట్టిన వడ్డీనే ఏకంగా రూ. 60 వేల కోట్ల నుంచి రూ. 70 వేల కోట్ల వరకూ ఉందన్నారు. ఈ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం రూ. 1.15 లక్షల కోట్ల అప్పు ఉంటే ప్రజలకు మాత్రం రూ. 1.65 లక్షల కోట్లు నేరుగా పంపిణీ చేశామన్నారు. అంటే అప్పు కన్నా ఎక్కువగా ప్రజలకు డబ్బు ఇచ్చిన ప్రభుత్వం ఇదన్నారు.


హుదూద్ సమయంలో విశాఖ ప్రజలకు చంద్రబాబు పాచిపోయిన పులిహోర తప్ప ఏ సాయం చేయలేదు !


చంద్రబాబు పాలనలో  అప్పులు తప్ప డీబీటీలు లేవన్నారు.  బాబు పాలనలో ఉన్నదంతా దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం అని విమర్శించారు.  అందుకే మాది డీబీటీ ప్రభుత్వం అయితే.. చంద్రబాబుది డీపీటీ ప్రభుత్వం అని జగన్ చెప్పారన్నారు.  రా అసలు, వడ్డీ బాబు హయాంలో  పెరిగినంతగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పెరగలేదని స్పష్టంగా కనిపిస్తోందన్నారు. హుద్ హుద్ వల్ల మొత్తం కలిగిన నష్టం రూ. 70 వేల కోట్ల వరకు ఉంటుందన్నారు. హుదూద్ వచ్చిన సమయంలో చంద్రబాబు ఫోటోలు తీయించుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. హుద్ హుద్ లో బాబు పంచింది.. కేవలం పాచిపోయిన పులిహోర ప్యాకెట్లు మాత్రమేన్నారు. బాధితులకు పదికేజీల బియ్యం ఇచ్చారని..  బాబు 5 ఏళ్ళ పాలనలో గానీ తుఫాన్లు వచ్చినప్పుడు బాధితులకు బాబు డబ్బు రూపంలో అందించిన తక్షణ సాయం  సున్నా అన్నారు. 


జగన్ 11 రోజులు పర్యటించారు..నేనే ప్రత్యక్ష సాక్షిని !


హుద్ హుద్ సమయంలో  ఎవరికీ చేయకుండానే ఒక జీవో విడుదల చేశారని..  బాబు విడుదల చేసిన జీవో ఎక్కడా, ఎప్పుడూ అమలు కాలేదన్నారు.  ఇదే హుద్ హుద్ ప్రాంతంలో ఈ మూడు జిల్లాల్లో  జగన్   11 రోజులు పర్యటించారని..   ఆ పర్యటన మొత్తం తానున్నానని.. తానే ప్రత్యక్ష సాక్షినని తెలిపారు.  ఆ రోజుల్లో ఏ ఒక్క బాధితుడు కూడా, ఈ మూడు జిల్లాల్లో మాకు సాయం అందింది అని ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పలేదన్నారు. ఇప్పటి ప్రభుత్వం మాత్రం వరదలు వస్తే ప్రతి ఒక్కరినీ రక్షించుకోవడమే కాకుండా సాయం అందలేదని ఎవరూ చెప్పకుండా ప్రతి ఒక్కరినీ ఆదుకుందన్నారు. 


మాది సంక్షేమ ప్రభుత్వం


అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమం మీద ప్రధానంగా దృష్టి  పెట్టి, నవరత్నాల పథకాలన్నింటినీ ప్రతి ఇంటికీ అందించాం. కాబట్టే, ఈరోజున గడప గడపకూ వెళ్ళి టీడీపీ కార్యకర్తలతో సహా అందరికీ ఎంతెంత అందిందో చెప్పగలుగుతున్నామన్నారు.  మేం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ, 5 నెలల్లోపే ఏర్పాటు చేసిన గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థ బాగా ఉపయోగపడ్డాయి కాబట్టే ముంపు గ్రామాలను ఖాళీ చేయించడంలో, ప్రజలను కాపాడటంలో, వారికి సహాయం అందించడంలో, వరద నష్టాన్ని అంచనా వేయడంలో.. ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ వ్యవస్థ ఉపయోగపడిందని గుడివాడ అమర్నాత్ తెలిపారు.