కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా ( NTR Krishna ) అని పేరు పెడుతున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ( YS Jagan ) నిమ్మకూరులో ఉంటోన్న ఎన్టీ ఆర్ కుటుంబ సభ్యులు కలిశారు. నందమూరి పెదవెంకటేశ్వరరావు, నందమూరి జయసూర్య, చిగురుపాటి మురళి అనే ముగ్గురు నిమ్మకూరు వాసులు సీఎం జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. వీరికి ఎన్టీఆర్‌తో ఎలాంటి బంధుత్వం ఉందో వారు ప్రకటించలేదు. వీరిని మంత్రి కొడాలి నాని, ( Minister Kodali Nani ) పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి తీసుకు వచ్చారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సీఎంకు ధన్యవాదాలు తెలిపినట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు.
త్వరలో అధికారిక ప్రకటన, రాజ్యసభ ఇంకేమైనా అనేది క్లారిటీ లేదు : వైసీపీ నేత అలీ
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని గతంలో నిమ్మకూరు ( Nimmakur ) మీదుగా వైఎస్ జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కోరారాని కొడాలి నాని తెలిపారు. అప్పుడు ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ ఇప్పుడు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినట్లు తెలిపారు. నిమ్మకూరు లో ఉన్న చెరువులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహన్ని ( NTR Statue ) పెట్టాలని కోరగా అందుకు సీఎం అంగీకరించారని మంత్రి తెలిపారు. ఎన్టీఆర్ కు వందేళ్లు నిండిన సందర్భంగా మే లో విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సీఎం అంగీకరించినట్లు కొడాలి నాని తెలిపారు. నిమ్మకూరులో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు పైప్ లైన్ కోసం కోటి రూపాయలను సీఎం మంజూరు చేసినట్లు పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ ( Pamarru MLA ) ప్రకటించారు. గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు సీఎం ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. కృష్ణా జిల్లాను రెండుగా విభజిస్తున్న ఏపీ ప్రభుత్వం మచిలీపట్నం కేంద్రంగా ఉండే జిల్లాకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అనే పేరు ప్రతిపాదించింది.
మోహన్‌బాబును ప్రభుత్వం ఆహ్వానించినా అడ్డుకున్నారు - జగన్‌తో భేటీ తర్వాత మంచు విష్ణు ఆరోపణలు !
అభ్యంతరాల గడువు పూర్తయిన తర్వాత అధికారికంగా ఖరారు చేయనుంది. పేరు ప్రకటించిన తర్వాత ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెప్పలేదని వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శలు చేశారు. అయితే ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు స్వాగతిస్తున్నామని ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ, కుమార్తె పురందేశ్వరితో పాటు ఇతరులు కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబసభ్యుల పేరుతో నిమ్మకూరు నుంచి కొంత మందిని తీసుకెళ్లి రాజకీయం చేస్తున్నారని టీడీపీ నేతలు ( TDP Leaders ) అంటున్నారు. మొత్తంగా వచ్చే మేలో ఎన్టీఆర్ వందో వర్థంతి సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ నేతలు ఘనంగా సంబరాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.