Kurnool News: కర్నూలు (Kurnool) జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో (Pattikonda Constituency) వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) వరiస పర్యటనలు చర్చనీయాంశం అయ్యాయి. గోరంట్ల మాధవ్ పర్యటనలతో స్థానికంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గోరంట్ల మాధవ్ పర్యటనలకు కురువ సామాజికవర్గం భారీగా స్వాగతాలు పలుకుతోంది. గోరంట్ల మాధవ్ వరుస పర్యటనలు (Gorantla Madhav Tour in Pattikonda) పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే వర్గీయుల్లో అలజడి రేపుతోందని గుసగుసలు మొదలయ్యాయి. అసలు గోరంట్ల మాధవ్ పత్తికొండ నియోజకవర్గంలో పర్యటనలు ఎందుకు చేస్తున్నారు?


కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని మద్దికేర మండలం పెరవలి గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి తిరునాళ్ల రోజున గోరంట్ల మాధవ్ పర్యటన జరిగింది. తిరుమలకు వచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్‌ కు ఆయన సామాజిక వర్గం నేతలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. గతంలో పత్తికొండ నియోజకవర్గ కేంద్రంలో కురువ కార్తీక వన భోజనాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కూడా గోరంట్ల మాధవ్ హాజరయ్యారు. గోరంట్ల మాధవ్ పర్యటన (Gorantla Madhav Tour) సందర్భంగా కురువ నాయకులు పత్తికొండ పట్టణంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాట్లు చేశారు. అయితే పత్తికొండ గ్రామ పంచాయతీ సిబ్బంది గోరంట్ల మాధవ్ ఫ్లెక్సీలను తొలగించారు. గోరంట్ల మాధవ్ ఫ్లెక్సీలు తొలగింపుకు స్థానిక ఎమ్మెల్యే గ్రామ పంచాయతీ అధికారుల ద్వారా ఫ్లెక్సీలు తొలగించాలని స్థానికంగా దీనిపై పలు రకాలుగా వాదనలు వినిపించాయి. గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) ఫ్లెక్సీల తొలగింపుపై కురువ నాయకులు తీవ్రంగా ఖండించారు.


అయితే, గోరంట్ల మాధవ్ పత్తికొండ నియోజకవర్గంలో (Gorantla Madhav Pattikonda Tour)పర్యటనలో స్థానిక వైసీపీ పార్టీ లోని నాయకులకు అలజడి మొదలైనట్టు తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికలలో పత్తికొండ నియోజకవర్గం నుండి వైసీపీ టికెట్ కోసం గోరంట్ల మాధవ్ ప్రయత్నాలు చేస్తున్నాడేమో అని పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి.