BRS Menifesto :  ప్రతిపక్షాలకు మైండ్  బ్లాంక్ అయ్యే మేనిఫెస్టోను కేసీఆర్ రెడీ చేస్తున్నారని మంత్రి హరీష్ రావు ప్రతి సమావేశంలోనూ చెబుతున్నారు. త్వరలోనే తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ ఉంటుందని కేటీఆర్ వరంగల్ లో ప్రకటించారు. ఆ గుడ్ న్యూస్ మేనిఫెస్టోలోనే ఉంటుందని చెప్పకనే చెప్పారు. కీలకమైన సమయంలో మూడు వారాల నుంచి బయటకు రాకుండా మేధో వర్గాలతో సంప్రదింపులు జరిపి కేసీఆర్ మేనిఫెస్టో మీదనే చర్చలు జరుపుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ఇంతగా చర్చిస్తున్న మేనిఫెస్టో ఎంత సంచలనం ఉండబోతోంది ? ఇప్పటికే కేసీఆర్ ప్రకటించి అమలు చేస్తున పథకాలను మించి ఉంటాయా ?


మేనిఫెస్టోపై కేసీఆర్ విస్తృత సంప్రదింపులు 


తెలంగాణలో ఎన్నికలకు ముహూర్తం సమీపిస్తోంది. మ్యానిఫెస్టోల మేనియాకు పార్టీలు సిద్దమయ్యాయి. ప్రజలంతా ఆసక్తితో ఏ పార్టీ ఏం ప్రకటిస్తుందోనని వేచిచూస్తున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి రెడీ అయిపోగా, బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే ఓ అడుగు ముందుకేసి 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఈ నెల 16న వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు- చేసేందుకు సిద్ధమైంది.
ముఖ్యంగా రైతులు, యువతతో పాటు మహిళలపై దృష్టి సారించి వారిని ఆకట్టుకునేలా మేనిఫెస్టో తయారి తుదిరూపులో గులాబీ బాస్‌ నిమగ్నమయ్యారు. మ్యానిఫెస్టోలో ప్రకటించే హామీలకు ఎంత ఖర్చువుతుందనే అంశాలపై సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పలు వర్గాలకు చెందిన నిపుణులతో చర్చిస్తూనే సాధ్యాసాధ్యాలపై లెక్కలు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే పాత, కొత్త పథకాలతో మ్యానిఫెస్టో తుది రూపుకు తెచ్చారని చెబుతున్నారు. 


పూర్తిగా కొత్త హమీైలపైనే కేసీఆర్ దృష్టి 
 
ప్రజాకర్శక పథకాలపై బీఆర్‌ఎస్‌ సుప్రీం రైటిర్డ్‌ ఐఏఎస్‌లు, ప్రొఫెసర్లు, ఆర్ధిక నిపుణులు, వివిధ రంగాల నిష్ణాతులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాలను మరింత పెంచడంతోపాటు కొత్తగా నాలుగయిదు స్కీములకు అంకురార్పణ చేయనున్నారని తెలిసింది.  ఆయా పథకాలను ప్రకటిస్తే ఖజానాపై ఎంత భారం పడుతుందనే అంచనాలను రూపొందిస్తున్నారు. ప్రాజెక్టులు, ఇతర ముఖ్యమైన పథకాలకయ్యే వ్యయాలపై లెక్కలేస్తున్నారు. గత వారం రోజులుగా ప్రగతిభవన్‌కు సీనియర్లను పిలిపించుకుని మ్యానిఫెస్టోపై కసరత్తు చేస్తున్నారు. ఏదో గాల్లో పథకాలు ప్రకటించకుండా అమలు చేయడానికి తన దగ్గర ఉన్న ప్రణాళికలను కూడా ప్రజలకు వివరిస్తారని చెబుతున్నారు.  


ఇప్పటికే ట్రేడ్ మార్క్ పథకాలు - వాటిని మించి పథకాలు ప్రకటిస్తారా ?


కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణలో ఎవరూ ఊహించనంత భారీ పథకలను అమలు చేస్తున్నారు. ఇన్నీ  లబ్దిదారులకు లక్షల్లో నగదు బదిలీ చేసేవే. దళిత కుటుంబాలకు పది లక్షలు, బీసీ - మైనార్టీలకు లక్ష, గృహలక్ష్మి కింద మూడు లక్షలు ఇస్తున్నారు. ఇక కల్యాణమస్తు సహా అనేక పథకాలు నేరుగా లబ్దిదారులకు నగదు బ దిలీ ఇచ్చేవే.  ఇలాంటి పథకాలను మరిపించేలా కేసీఆర్ కొత్త పథకాలు ప్రవేశ పెట్టాల్సి ఉంది. 


కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్ని మరిపించడం ముఖ్యం ! 


కర్ణాటకలో లభించిన విజయంతో కాంగ్రెస్ పార్టీ ఆరు హామీల్ని ప్రకటించింది వాటిపై ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అందుకే వాటిని మరిపించేలా కేసీఆర్ కొత్త మేనిఫెస్టో సిద్ధం చేయాలనకుంటన్నారు.  రైతుబంధు తరహాలో రెండు వ్యవసాయ సీజన్లలో రైతులకు ఉచితంగా ఎరువులు (యూరియా, డీఏపీ, ఎన్‌పీకే) లను ప్రకటించాలని సీఎం భావిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. అన్ని రకాల ఆసరా పింఛన్లను రూ.1,000 పెంచాలని కూడా సీఎం యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల వికలాంగుల పెన్షన్‌ను నెలకు రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచగా.. మిగతా వారికి కూడా రూ.వెయ్యి పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రైతులు, యువతతో పాటు మహిళలపై దృష్టి సారించి వారిని ఆకట్టుకునేలా పార్టీ ఎన్నికల హామీలు ఉండనున్నాయి. 


వరంగల్ విజయగర్జన సభలో కీలక ప్రకటన   
 
కర్ణాటక తరహాలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు సైకిళ్లు, శానిటరీ న్యాప్‌కిన్లు ఉచితంగా పంపిణీ చేసే ప్రతిపాదనను పార్టీ పరిశీలిస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీల కళ్లు తిరిగేలా బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను తీసుకొని రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మంత్రి హరీశ్‌ రావు మేనిఫెస్టో విషయంలో ప్రజలకు లీకులు ఇచ్చారు. త్వరలోనే మరిన్ని శుభవార్తలు వింటారని, ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా మేనిఫెస్టో ఉంటుందని చెప్పారు. యువతలో నిరుత్సాహాన్ని ప్రారదోలేలా సరికొత్‌త ఉపాధి పథకంపై పార్టీ ఆలోచనలు చేస్తోంది. నిరుద్యోగ భృతి నగదుగా కాకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ప్రైవేట్‌ రంగంలో ఉపాధి కల్పనపై దృష్టిసారిస్తోంది. అయితే వీటిని  ప్రకటించడమే కాదు.. ప్రజలు నమ్మేలా చేయడం కూడా కీలకమే. ఈ దిశగా కేసీఆర్ సక్సెస్ అయితే ఆయనకు తిరుగు ఉండద్న అభిప్రాయం ఉంది.