తెలంగాణ సీఎం కేసీఆర్ ( KCR Delhi Tour )  ఢిల్లీ పర్యటనలో ఎలాంటి విశేషాలు లేవు. అయన జాతీయ రాజకీయాలపై చర్చలు జరిపేందుకు ప్రాంతీయ పార్టీల నేతలను ఏకం చేసేందుకు ఢిల్లీ వెళ్లాలని టీఆర్ఎస్ ( TRS )  వర్గాలు మీడియాకు చెప్పాయి. సోమవారం సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లే ముందు మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో సమావేశం అవుారన్న ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ వర్గాలు కూడా అదే చెప్పాయి. కానీ మంగళవారం అసలు కేసీఆర్ ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ( Kejrival ) కూడా ఢిల్లీలో లేరు. ఆయన  బెంగుళూరులోని జిందాల్ ప్రకృతి ఆశ్రమంలో చికిత్స తీసుకుంటున్నారు. మరో వారం రోజుల పాటు ఆయన ఢిల్లీకి రారు. 


బడ్జెట్ సమావేశాలకు గవర్నర్‌ను ఆహ్వానించకపోవడంపై సంజయ్‌ ఘాటు విమర్శలు, సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్


అంటే కేజ్రీవాల్‌తో కేసీఆర్ భేటీ లేనట్లే. అదే సమయంలో మరో ప్రాంతీయ పార్టీల నేతలతో కానీ గతంలో చెప్పినట్లుగా రిటైర్డ్ ఉన్నతాధికారులతో మేధోమథనం కానీ చేయడం లేదు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఆయన మంగళవారం తనకు చికిత్స చేసే పంటి వైద్యుడిని కలిసినట్లుగా తెలుస్తోంది. బుధవారం ఎయిమ్స్‌ కేసీఆర్ సతీమణికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అంతే తప్ప కేసీఆర్ కు ప్రత్యేక కార్యక్రమాలు లేవని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 


తెలంగాణ బీజేపీ నేత ఇంటి వద్ద నలుగురు కిడ్నాప్, ఇంతకీ కారులో వచ్చిందెవరు?


ఢిల్లీలో నిర్మిస్తున్న టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణ పరిశీలన చేసి హైదరాబాద్ తిరుగు పయనమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. యూపీలో చివరి విడత ఎన్నికలు జరగనున్న  ప్రాంతాల్లో ప్రధాని మోడీ ప్రాధానిధ్యం వహిస్తున్న వారణాశి ( Varanasi ) నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ ప్రచారంచేసేందుకు మమతా  బెనర్జీ వెళ్తున్నారు. వారణాశిలో గణనీయ సంఖ్యలో బెంగాలీలు ఉన్నారు. అక్కడ ప్రచారం చేయడానికి కేసీఆర్ కూడా వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ టీఆర్ఎస్ వర్గాలు మాత్రం ధృవీకరించడం లేదు. 


ఎవరినీ కలవకుండా కేసీఆర్  ఢిల్లీ నుంచి తిరిగి వస్తే రాజకీయ విమర్శలు వచ్చే అవకాశం ఉంది. గతంలో ధాన్యం కొనుగోళ్లపై అటో ఇటో తేల్చుకుంటామని కేసీఆర్ ప్రత్యేక బృందంతో ఢిల్లీ వెళ్లారు కానీ అక్కడా ఎవర్నీ కలవలేదు. నాలుగు రోజుల తర్వాత తిరిగిర వచ్చారు. ఇప్పుడూ ఇదే పునరావృతం అయితే ఆయనను ఢిల్లీ రాజకీయాల్లో ఎవరూ పట్టించుకోవడం లేదని రాజకీయ ప్రత్యర్థులు విమర్సలు గుప్పించే అవకాశం ఉంది.