జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలపై హాట్ కామెంట్స్ చేశారు. వారాహి యాత్ర తెలంగాణలో ఉంటుందా లేదా అన్నదానిపై కూడా రియాక్ట్ అయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యామ్ వారాహి యాత్ర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌లో పవన్ ఓ యాగాన్ని కూడా తలపెట్టారు. అది రెండో రోజు కొనసాగుతోంది. ఇక్కడ యాగం ముగించుకున్న తర్వాత పవన్ నేరుగా అన్నవరం చేరుకుంటారు. బుధవారం ఉదయం అక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామికి  ప్ర్యత్యేక పూజలు చేసి వారాహి యాత్రను స్టార్ట్ చేస్తారు. సాయంత్రానికి బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. 


తెలంగాణలో యాత్రపై క్లారిటీ


యాగ దీక్షలో ఉన్న పవన్ కల్యాణ్‌ను కొందరు తెలంగాణ జనసేన నేతలు వచ్చి కలిశారు. తెలంగాణలో యాత్రపై క్లారిటీ ఇవ్వాలని.. ఎన్నికల దగ్గరకు వస్తున్న టైంలో పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయాలని చెప్పారు. వారితో మాట్లాడిన పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్‌లో తెలంగాణలో జరగనున్నాయని... అదే టైంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికలు ఉంటాయన్నారు. 


డిసెంబర్‌లోనే ఎన్నికలు


రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి డిసెంబర్‌లో ఎన్నికలు ఉంటాయని అందుకున్న తగ్గట్టుగానే సన్నద్దంగా ఉండాలని పార్టీలీడర్లకు సూచించారు. తెలంగాణలో కావాలనుకుంటే పొత్తులతో వెళ్తామని లేదంటే ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. దీనిపై మరింత చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇంతలో జనసేన నాయకులు ప్రజల్లో ఉండి సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ఏ సిద్ధాం ప్రకారం తెలంగాణ వచ్చిందో అది ఎంత వరకు నెరవేరింది... యువత ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేసే క్రమంలో ఇంటిగ్రిటీని పోగొట్టుకోవద్దని జనసేన నేతలకు పవన్ సూచించారు. ఒంటరిగా పోటీ చేసిన తక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని వాటిపైనే ఫోకస్డ్‌గా పని చేస్తామన్నారు. నేతలు మాత్రం నిత్యం ప్రజల్లో ఉండి సమస్యలు తెలుసుకోవాలన్నారు. 


తెలంగాణలో ముగింపు 


తెలంగాణలో వారాహి యాత్ర ఉంటుందో లేదో అన్న అంశంపై కూడా పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. వారాహి ఎక్కడ మొదలైందో అక్కడే ముగించే ఆలోచన కూడా ఉన్నట్టు తెలిపారు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో యాత్ర ఉంటుందని చెప్పగానే నేతలంతా హర్షం వ్యక్తం చేశారు. చప్పట్లు కొట్టి ఆనందం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ... డిసెంబర్‌లో ఎన్నికలు జరిగితే తాను జూన్ నుంచి ప్రజల్లో ఉంటానని యాత్ర చేపడతానంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన యాత్ర చేస్తున్నారు. 


నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల నియామకం 


తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నేరవేర్చడమే జనసేన లక్ష్యమని తెలిపారు పవన్ కల్యాణ్. జనసేన కేంద్ర కార్యాలయంలో తెలంగాణ నాయకులతో మాట్లాడుతున్న సందర్భంగా 26 నియోజకవర్గాలకు బాధ్యులను కూడా నియమించారు. ప్రజల్లో ఉంటూ పార్టీని విజయతీరాలకు చేర్చేల కష్టపడాలని సూచించారు. 

 


నిర్మాతల హర్షం


మరోవైపు 14వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ చేపట్టబోయే యాత్ర అనుకున్న లక్ష్యాన్ని సిద్ధించే గొప్ప యాత్ర కావాలన్నారు సినీ ప్రముఖులు. సోమవారం ఆయన్ని కలిసి కొందరు నిర్మాతలు షూటింగ్‌లపై క్లారిటీ తీసుకున్నారు. సెట్స్‌పై ఉన్న సినిమాలు పూర్తి చేయడం కూడా తన బాధ్యత అని చెప్పుకొచ్చారు. రాజకీయాలు, ఇటు షూటింగ్స్‌ రెండింటికీ సమ ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తానని చెప్పినట్టు పేర్కొన్నారు.  దీంతో ఆనందం వ్యక్తం చేసిన నిర్మాతలు... ప్రజా క్షేమం కాంక్షిస్తూ చేస్తున్న యాగక్రతువులో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని, వారాహి యాత్ర సైతం రాజకీయాల్లో నవశకానికి నాంది పలుకుతుందన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూనే, రాజకీయాల్లోనే రాణించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరిచిపోలేని నాయకుడు కావాలంటూ యాత్రకు సంసిద్ధమవుతున్న జనసేనానికి శుభాభినందనలు తెలిపారు.


Also Read: జనసేనలో చేరిన ప్రముఖ సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్