Jagan visit to Tirumala is controversial : తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ రివర్స్ లోనే ఉన్నాయి. అన్నీ ఒక దాన్ని మించి ఒకటి రాజకీయంగా నష్టం చేసేలా ఉన్నాయి. ఈ నిర్ణయాల వెనుక వ్యూహం ఏమిటో కానీ.. టీటీడీ, జనసేన,  బీజేపీ ట్రాప్‌లో పడిపోతున్నామా అన్న భావన వైసీపీ కార్యకర్తల్లో పెరిగిపోతోంది. జగన్ తిరుమలకు వెళ్లాలని అనుకోవడం అతి పెద్ద  బ్లండర్ అవుతుందని  ఆందోళన చెందుతున్నారు. 


లడ్డూ కల్తీ ఇష్యూలో రాజకీయంగా తడబడుతున్న వైసీపీ


చంద్రబాబునాయుడు తిరుమల లడ్డూ కల్తీ అంశాన్ని బయట పెట్టిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ షాక్‌కు గురయింది. ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నేత.. నోటికి వచ్చిన ఆరోపణలు చేయలేరు. పైగా తిరుమల అంశంలో. ఎవో కొన్ని ఆధారాలు ఉంటాయని అందుకే అలా మాట్లాడి ఉంటారని ఊహించలేకపోయారు. మరుక్షణం చంద్రబాబు ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తున్నారని ఎదురుదాడి చేశారు. కానీ వరుసగా ఒక్కో ఆధారం వెలుగులోకి వచ్చింది. అధికారికంగా నియమించిన సిట్ అసలు విషయాలను బయట పెడుతుంది. మొదటే చంద్రబాబు ప్రకటించినప్పుడే కాస్త తెలివిగా ఆలోచించి టీటీడీ బోర్డు, పర్చేజింగ్ కమిటీ బాధ్యతగా మార్చేసి ఉంటే  వైసీపీ మీద ఇంత నెగెటివ్ వచ్చి ఉండేది కాదన్న అభిప్రాయం. కానీ అసలు కల్తీనే జరగలేదన్న స్టాండ్‌కు కట్టుబడి వాదిస్తూండటంతో దానికి పస లేకుండా పోయింది. 



Also Read: తిరుమల లడ్డూ వివాదంలో మరో కీలక పరిణామం- ఏఆర్ సంస్థపై కేసులు




చంద్రబాబు ఇలా లడ్డూ ఇష్యూతో ప్రారంభిస్తే... వెంటనే ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో పవన్ కల్యాణ్ సనాతన ధర్మ రాజకీయానికి శ్రీకారం చుట్టారు. అందులో రాజకీయం ఉందా లేదా అన్న సంగతి పక్కన ప పెడితే ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి రాజకీయ కోణంలోనే చూడాలి. సనాతన ధర్మాన్ని వైసీపీ నాశనం చేసిందని.. ఆ పార్టీని హిందువులు సమర్థిస్తే అది హందూద్రోహమేనన్న అభిప్రాయాన్ని బలంగా పంపడంలో తనదైన ముద్రవేశారు. ఈ విషయంలో వైసీపీ ఎదురుదాడి విచిత్రంగా సాగింది. పవన్ వాదననకు గట్టిగా  సమాధానం చెప్పలేకపోయారు పేర్ని నాని, కొడాలి నాని. ఈ విషయంలోనూ వైసీపీ వెనుకబడిపోయింది. 


'తిరుమలను ప్రత్యేక దేశంగా చేయండి' - కేఏ పాల్ సరికొత్త డిమాండ్


తిరుమలలో వివాదాలు తలెత్తితే నిందించేది వైసీపీనే 


లడ్డూ రాజకీయాలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చేందుకని జగన్ ఆలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చారు. ఆయన స్వయంగా శ్రీవారిని దర్శించుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఇప్పటికే ఆయనపై హిందూ వర్గాల్లో ఉన్న వ్యతిరేకత ఏమిటో ఆయన ఇంటిపై పడిన కాషాయ  రంగే చెబుతోంది. ఇలాంటి సమయంలో తిరుమలకు వెళ్లేందుకు సిద్ధపడటం రాజకీయంగా చాలా ఆలోచనలేని నిర్ణయమని ఎక్కువ మందిభావన. ఎందుకంటే.. అక్కడ డిక్లరేషన్ వివాదం  వస్తుంది.. ఆయనను అడ్డుకోవడానికి హిందువులు వస్తారు.. కొండపై భక్తులూ ప్రశ్నిస్తారు. ఈ ప్రమాదాల్ని ఏ మాత్రం ఊహించకుండా.. తిరుమల టూర్ కు రెడీ అయ్యారు. ఈ టూర్‌లో తిరుమలలో లేదా..తిరుపతిలో ఉద్రిక్తతలు తలెత్తితే అది ఖచ్చితంగా వైసీపీనే పడుతుంది. దాని వల్ల రాజకీయంగా జరిగే నష్టం చాలా ఎక్కువ. 


కారణాలు ఏదైనా.. లడ్డూ విషయాన్ని డీల్ చేయడంలో వైసీపీ వ్యూహకర్తలు ఘోరంగా ఫెయిలయ్యారు. ఎంత తక్కువ డ్యామేజీతో బయటపడాలో ఇప్పుడు వారు అతి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.