Jagan is strategically using the Center as a safe guard in the case of Adani: సెకీ విద్యుత్ ఒప్పందాల విషయంలో తాము కేంద్రం లేఖకే స్పందించి ఒప్పందాలు చేసుకున్నామని జగన్ స్పష్టం చేస్తున్నారు. తక్కువకే విద్యుత్ ఇస్తామని సెకీ లేఖ రాసింది. తామే పవర్ సప్లై చేస్తామని చెప్పింది. దీనిలో మూడోపార్టీకి స్థానం ఎక్కడుంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. సెకీ ఎవరి దగ్గర నుంచి విద్యుత్ కొంటుందో తమకు అనవసరమని వారితో తాము ఒప్పందాలు చేసుకోలేదని జనగ్ వాదిస్తున్నారు.
సాంకేతికంగా సెకీతో డిస్కంల ఒప్పందాలు
కేంద్ర ప్రభుత్వ సంస్థయైన సెకితో, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డిస్కామ్‌లు ఒప్పందం కుదుర్చుకు న్నాయి. ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం. అదే సమయంలో ఇతర విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ ఛార్జీలు లేవని.. వాటిని కూడా మినహాయించారని జగన్ చెబుతున్నారు. అంతే స్పెషల్ ఇన్సెంటివ్ కూడా ఇస్తానని అందని.. వీటన్నింటివల్ల ఏడాదికి రూ.4,400 కోట్లు కలిసి వస్తాయని వాదించారు. ఇలాంటి ఆఫర్‌ను కాదంటే, తక్కువ ధరకు విద్యుత్ వస్తుంటే కొనలేదని మరలా ఇదే నాయకులు విమర్శలు చేసేవారని ఎదురుదాడి చేశారు. ఒప్పందంలో అదానీ అంశం లేదు.
Also Read: YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
అదానీపై నమోదైన కేసు వ్యవహారంలో ఎక్కడా తనపేరు లేదని సిఎంగా ఉన్నంతమాత్రాన తనకు ఉన్న సంబంధం ఏమిటని జగన్ అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం అని స్పష్టంగా ఉందని మీడియా ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఇంకా భిన్నంగా స్పందించారు. తాను సీఎం..తన వద్ద ఉన్న సీఐడీతో బైడెన్ పేరు రాయిస్తే అయిపోతుందా అని ప్రశ్నించారు. అంటే కుట్ర పూరితంగా తన పేరు అక్కడ ప్రస్తావించి ఉంటారని జగన్ అనుకుంటున్నారని అనుకోవచ్చు. అయితే అమెరికాలో జగన్ పై కేసు లేదు. గౌతమ్ అదానీతో తపాటు.. మరికొంత మంది పై ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి. అయితే లంచం ఇచ్చిన వారిపై కేసు పెట్టారు కానీ..తీసుకున్న వారి విషయంలో అమెరికా ఎప్‌బీఐకు సంబంధం లేదు.. ఆ పరిధి కూడా లేదు. అందుకే పెట్టలేదని నిపుణులు చెబుతున్నారు.
Also Read: నాడు అనంతబాబు నేడు శ్రీకాంత్- హత్య కేసులో బెయిల్‌పై విడుదలైనప్పుడు చేస్తున్న హంగామాపై విమర్శలు
కేంద్రమే జగన్‌కు బలం !
ఇక్కడ అదానీ , జగన్ మధ్య నేరుగా ఒప్పందం జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ మధ్యలో మధ్యవర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీ ఉంది. అదానీ మూడో పార్టీగా ఉన్నారు. అది కూడా రాష్ట్రంతో సంబంధం లేకుండా . ఈ విషయంలో జగన్ పై అవినీతి ఆరోపణల విషయంలో కేంద్రం కూడా దూకుడుగా స్పందించడానికి అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు. ఒక వేళ అమెరికా కోర్టు గ... అదానీ కంపెనీలు.. జగన్ మోహన్ రెడ్డికి ఫలానా రూపంలో లంచాలు ఇచ్చాయని అధారాలు చూపిస్తే మాత్రం జగన్ మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. లంచాలు ఇచ్చారు అని చెప్పారు కానీ ఏ రూపంలో ఇచ్చారో మాత్రం ఇంత వరకూ అమెరికా దర్యాప్తు సంస్థలు ప్రకటించలేదు. ఎలా చూసినా జగన్‌కు కేంద్రం ఈ డీల్ విషయంలో షీల్డ్ గా ఉంటుందన్న భావన మాత్రం గట్టిగా వినిపిస్తోంది.