AP Elections 2024: హిందూపురం: తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా హిందూపురం నియోజకవర్గం ఉంది. దివంగత నందమూరి తారక రామారావు (NTR) పార్టీ స్థాపించినప్పటి నుంచి హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీదే హవా. అలాంటి సెగ్మెంట్లో పార్లమెంటు స్థానం నుంచి చేయడానికి చాలామంది ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ (TDP) అధిష్టానం మాత్రం ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని సామాజిక సమీకరణాలు చూసుకుంటూ అభ్యర్థుల స్థానాలను కేటాయింపు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లే పరిస్థితి. హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. 
పార్లమెంటు బరిలో బీసీ నేతకు ఛాన్స్!
హిందూపురం పార్లమెంటు వ్యాప్తంగా బీసీ ఓటర్లు అధికంగా ఉంటారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతని పార్లమెంటు బరిలో దించాలని ఆలోచనలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తున్న పేరు అంబికా లక్ష్మీనారాయణ. ఈయన రెండు దశాబ్దాల కాలం నుంచి టిడిపిలో సౌమ్యుడిగా కొనసాగుతూ వస్తున్నారు. పార్టీ ఆదేశానుసారం హిందూపురం (Hindupur) నియోజకవర్గం కాకుండా పార్లమెంటు వ్యాప్తంగా పార్టీని సమన్వయం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణ పార్లమెంటులో మంచి పట్టు ఉన్న నేత. హిందూపురం పార్లమెంటు వ్యాప్తంగా మూడున్నర లక్షలకు పైగా వాల్మీకి ఓట్లు ఉండటం కలిసి వచ్చే అంశం. 2014 ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అవకాశం వచ్చిన ఆఖరి నిమిషంలో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధం అవడంతో ఆస్థానం నుంచి అంబిక లక్ష్మీనారాయణ తప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో బాలకృష్ణ విజయానికి తన వంతు కృషి చేశారు. 
2014లో బాలకృష్ణ విజయం
2014లో హిందూపురం నుంచి పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు. రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేదిక్కించుకుంది. అనంతరం హిందూపురం నియోజకవర్గం లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పీఏగా ఉన్న శేఖర్ అనే వ్యక్తి వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందని గ్రహించి బాలకృష్ణతో చర్చించిన అనంతరం రంగంలోకి దిగిన అంబికా లక్ష్మీనారాయణ హిందూపురం నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలకు శేఖర్ ను తప్పించి పార్టీకి జరుగుతున్న నష్టాన్ని చక్కబెట్టారు. పార్టీకి ఇప్పటివరకు వీర విధేయుడుగా చంద్రబాబు మన్నాలు పొందుతూ ఉన్న అంబికా లక్ష్మీనారాయణ ప్రస్తుతం హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సిపి హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బోయ శాంతమ్మను బదిలోకి దించారు. అదే సామాజిక వర్గానికి చెందిన నేతను టిడిపి అధిష్టానం కూడా బరిలోకి దించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. 




మొదటగా పెనుగొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధిని హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా పంపించే ఆలోచనలో ఉన్నప్పటికీ బి.కె పార్థసారథి మాత్రం ఈసారి ఎమ్మెల్యే గాని పోటీ చేస్తానని చెప్పారు. దీంతో హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా వాల్మీకి వర్గానికి చెందిన అంబిక లక్ష్మీనారాయణకే అవకాశం కల్పించేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పైగా హిందూపురం పార్లమెంటు కు పోటీ చేసే వ్యక్తు ఎక్కువగా నాన్ లోకల్ వారే.. ప్రస్తుతం ఆ స్థానం ను లోకల్ వారికే కేటాయించాలని డిమాండ్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీ నుంచి పోటీ చేస్తున్న బోయ సంతమ్మ గుంతకల్లు లో వివాహం చేసుకున్న అని చేతున్నప్పటికి ఆమె కర్ణాటక లో నివాసం ఉంటున్నారు. లోకల్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అక్కడివారికే  టికెట్ ఇస్తే పార్టీకి కూడా కలిసి వస్తుందని గెలుపు కూడా సునాయసం అవుతుందన్న ఆలోచనాలో పార్టీ అధిష్టానం ఆలోచలనో ఉన్నట్లు సమాచారం. 


చంద్రబాబు నాయుడు చేసిన సర్వేలో కూడా అంబికా లక్ష్మీనారాయణ పేరే ముందుగా ఉన్నట్లు సమాచారం. అధికార వైసీపీకి చెక్ పెట్టాలంటే హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నేతనే కరెక్ట్ అని భావిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం  రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా పొత్తులలో భాగంగా సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టమవుతున్న తరుణంలో హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నేత అంబికా లక్ష్మీనారాయణకు కేటాయిస్తారా లేక పొత్తులలో భాగంగా వేరే ఎవరికైనా కేటాయిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.